వ్య‌క్తులు ముఖ్యం కాదు పార్టీనే సుప్రీం

Spread the love

స్ప‌ష్టం చేసిన ఏఐసీసీ నేత వేణుగోపాల్

న్యూఢిల్లీ : కేర‌ళ‌లో అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఏఐసీసీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. త‌దుప‌రి సీఎంగా వీడీ స‌తీశ‌న్ ను నియ‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు ఖ‌ర్గే. దీంతో నిన్న‌టి దాకా సీఎం రేసులో ఉన్న కేసీ వేణుగోపాల్ కు షాక్ త‌గిలింది. ఇదంతా కావాల‌ని త‌న‌ను సీఎం కాకుండా చేశారంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిపై గురువారం స్పందించారు కేసీ వేణుగోపాల్ న్యూఢి్ల్లీలో. వ్య‌క్తులు ముఖ్యం కాద‌ని, వారికంటే పార్టీ ముఖ్య‌మ‌ని స్పష్టం చేశారు. నేను కాంగ్రెస్ పార్టీకి కట్టుబడిన కార్యకర్తను. పార్టీ, ప్రజలే నాకు ముఖ్యం. నేను ఎల్లప్పుడూ హైకమాండ్ నిర్ణయాన్ని గౌరవిస్తాను విధేయుడైన కాంగ్రెస్ నాయకుడిగానే ఉంటాను అని ఆయన పేర్కొన్నారు. 63 మంది ఎమ్మెల్యేలలో చాలా మంది మద్దతు క‌లిగి ఉన్నారు .

ఈ విషయాన్ని కేరళ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దీపా దాస్‌మున్షీ కూడా ధృవీకరించారు. ముఖ్యమంత్రి పదవికి ప్రధాన పోటీదారుగా ఉన్న కేసీ వేణుగోపాల్ వి.డి. సతీశన్‌ను కేరళ తదుపరి ముఖ్యమంత్రిగా నియమించాలన్న ఏఐసీసీ నిర్ణయాన్ని అంగీకరించారు. అన్ని కోణాలను పరిగణనలోకి తీసుకున్న నాయకత్వం ఎంపికను అంగీకరించాలని ఆయన తన మద్దతుదారులను కోరారు. కేరళలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండే ప్రభుత్వం ఏర్పడుతుంది అని ఆయన అన్నారు. వేణుగోపాల్ అలప్పుళ లోక్‌సభ సభ్యుడిగా (MP) ఉన్నందున, ఆయన్ని ముఖ్యమంత్రిని చేయడం అంటే రెండు ఉప ఎన్నికలకు దారితీయడమే అవుతుందన్నారు.

  • Related Posts

    రేపే 12 ప్రాజెక్టుల‌కు సీఎం, రాజ్ నాథ్ శంకుస్థాప‌న‌

    Spread the love

    Spread the loveఇక నుంచి రాయ‌ల‌సీమ రక్ష‌ణ సీమ అమ‌రావ‌తి : సీఎం చంద్రబాబు నాయుడు ఈనెల 15న శుక్ర‌వారం రాయ‌ల‌సీమ‌లో ప‌ర్య‌టించ‌నున్నారు.ఉదయం 08:15 గంటలకు క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి 09:45 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి…

    బాధితుల‌కు మెరుగైన వైద్యం అందించాలి

    Spread the love

    Spread the loveఆదేశించిన మంత్రి నిమ్మ‌ల రామానాయుడు అమరావతి : రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. గురువారం పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం సీతాలం కొండేపాడు ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీల తో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *