తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయాలకు కట్టుబడి ఉంటా

Spread the love

స్ప‌ష్టం చేసిన ప్ర‌ముఖ న‌టుడు అక్కినేని నాగార్జున‌

హైద‌రాబాద్ : న‌టుడు అక్కినేని నాగార్జున ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. శుక్ర‌వారం ఆయ‌న తెలుగు ఫిల్మ్ చాంబ‌ర్ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ఫిల్మ్ చాంబ‌ర్ తీసుకునే నిర్ణ‌యాలు క‌ట్టుబ‌డి ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థలలో ఒకటైన అన్నపూర్ణ స్టూడియోస్‌కు నాగార్జున యజమాని. ప్రొడ్యూసర్స్ గిల్డ్ , తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ మధ్య కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో త‌న వైఖ‌రిని స్ప‌ష్టం చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఇందుకు గాను నాగార్జున త‌ర‌పున అన్న‌పూర్ణ స్టూడియోస్ ఒక ప్ర‌క‌ట‌న చేసింది.

అన్నపూర్ణ స్టూడియోస్ చిత్ర పరిశ్రమ ప్రయోజనాలకు గట్టిగా కట్టుబడి ఉంటుంది. అన్నపూర్ణ స్టూడియోస్ డిస్ట్రిబ్యూషన్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) నిర్ణయాలకు కట్టుబడి, దాని మార్గదర్శకాలను పాటిస్తుందని స్పష్టం చేయాలని అనుకుంటోంది. ఇది సంవత్సరాలుగా మా స్థిరమైన ఆచరణ, భవిష్యత్తులో కూడా అలాగే కొనసాగుతుంది. ఇక నాగార్జున‌ నిర్మాణ, పంపిణీ సంస్థలలో ఒకటైన అన్నపూర్ణ స్టూడియోస్‌కు యజమాని. ఆయన మేనకోడలు సుప్రియా యార్లగడ్డ, స్టూడియోలోని పలు కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ, ప్రొడ్యూసర్స్ గిల్డ్‌లో కూడా చురుకైన సభ్యురాలిగా ఉన్నారు.

  • Related Posts

    సీఎం జోసెఫ్ విజ‌య్ డ్యాన్స్ వీడియో వైర‌ల్

    Spread the love

    Spread the loveత్వ‌ర‌లో రిలీజ్ కానున్న జ‌న నాయ‌గ‌న్ చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్రానికి నూత‌న సీఎంగా ఎన్నికైన ప్ర‌ముఖ న‌టుడు విజ‌య్ చంద్ర‌శేఖర్ ఇప్పుడు వైర‌ల్ గా మారారు. త‌ను చివ‌రిసారిగా న‌టించిన జ‌న నాయ‌గ‌న్ చిత్రంలో భాగంగా సింగ‌పూర్…

    త‌మిళ‌నాడు భూమి పుత్రుడు జోసెఫ్ విజ‌య్

    Spread the love

    Spread the loveసంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన న‌టి స‌న‌మ్ శెట్టి చెన్నై: జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంద‌ర్బంగా సినీ ప్ర‌ముఖులు పెద్ద ఎత్తున హాజ‌ర‌య్యారు. తమిళ నటి సనమ్ శెట్టి ఇలా అన్నారు. ఈ రోజు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *