విద్య తోనే వికాసం..విజ్ఞానం : క‌మిష‌న‌ర్

అంత‌ర్జాతీయ జీవ వైవిధ్య దినోత్స‌వం

హైద‌రాబాద్ : జీవితంలో ఎద‌గాలంటే త‌ప్ప‌నిస‌రిగా విద్య అనేది త‌ప్ప‌కుండా ఉండాల‌న్నారు హైద‌రాబాద్ న‌గ‌ర పాల‌క సంస్థ కమిష‌న‌ర్ క‌ర్ణ‌న్. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర బయో డైవర్సిటి బోర్డు పాఠశాల విద్యార్థులకు ఫోటోగ్రఫీ ,వ్యాస, ఉపన్యాస పోటీలు నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఈ పోటీల్లో పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. గెలుపొందిన విద్యార్థులకు హైదరాబాదు బిర్లా ప్లానిటోరియం లోని భాస్కర హాలులో బహుమతులు అందజేశారు.

బోర్డు కార్యదర్శి కాళిచరణ్ , జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తదితరులు విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఫోటోగ్రఫీ లో మొదటి బహుమతి, ఉపన్యాస పోటీలో రెండో బహుమతిని కామారెడ్డి జిల్లా సిద్దిరామేశ్వర నగర్ కు చెందిన అరవ తరగతి చదువుతున్న సంహిత గెలుచుకుంది. అలాగే వ్యాస రచన పోటీలో 8 వ తరగతి చదువుతున్న సహస్ర మూడో బహుమతి గెలుచుకుంది. ఈ సంద‌ర్బంగా జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ క‌ర్ణ‌న్ ప్ర‌సంగించారు. విద్య‌తోనే వికాసం, విజ్ఞానం అల‌వ‌డుతుంద‌న్నారు. విలువైన కాలాన్ని వృధా కానీయ‌వ‌ద్ద‌ని కోరారు.

  • Related Posts

    ప్రధాని మోదీతో ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియన్ భేటీ

    టెహ్రాన్ : ఇరాన్ అధ్యక్షుడు ప్రధాని మోదీ, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ , కిర్గిజ్‌స్థాన్, రష్యా, తజికిస్థాన్ అధ్యక్షులతో సహా పలువురు పాల్గొనే నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. కిర్గిజ్‌స్థాన్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్…

    వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం చారిత్రాత్మక ఘట్టం

    అమరావ‌తి : వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం చారిత్రాత్మక ఘట్టం అని పేర్కొన్నారు మంత్రి మండిప‌ల్లి రాంప్ర‌సాద్ రెడ్డి. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో వెలిగొండను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశార‌న్నారు. ఈ సంద‌ర్బంగా సీఎంకు ధ‌న్య‌వాదాలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *