ఎండ వేడిమి ఉంటే సెల‌వులు ప్ర‌క‌టించండి

Spread the love

సీఎం చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో వ‌డ‌గాలులు వీస్తున్నాయి. దీంతో సీఎం స‌చివాల‌యంలో అత్య‌వ‌స‌ర స‌మావేశం నిర్వ‌హించారు. రాష్ట్రంలో తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు, వడ గాలుల నుంచి రక్షణ పొందేందుకు సన్నద్ధత చర్యల పై ఆరా తీశారు. హీట్ వేవ్ పరిస్థితిని ఎదుర్కోనేలా ఎక్కడికక్కడ టెంట్లు, చలివేంద్రాలు, చల్లని నీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఎలాంటి నిర్ల‌క్ష్యం వ‌హించ వ‌ద్ద‌ని సూచించారు. ఎప్ప‌టిక‌ప్పుడు జిల్లా క‌లెక్ట‌ర్లు మానిట‌రింగ్ చేయాల‌న్నారు సీఎం.

అంతే కాకుండా సీఎం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల్లో స్థానికంగా శెలవులు ప్రకటించేలా చూడాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా తాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ఎండల తీవ్రత, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేలా జిల్లా కలెక్టర్లు మీడియా సమావేశాలు నిర్వహించాలని నిర్దేశించారు. సమీక్షకు సీఎస్ సాయి ప్రసాద్, విపత్తు నిర్వహణ, వైద్యారోగ్య, పురపాలక, పంచాయితీరాజ్ శాఖ ఉన్నతాధికారులు హాజ‌ర‌య్యారు.

  • Related Posts

    కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేష‌న్ ఆప‌రేష‌న్లలో నిమ్స్ రికార్డ్

    Spread the love

    Spread the loveవైద్యుల‌ను స‌న్మానించిన మంత్రి దామోద‌ర హైద‌రాబాద్ : నిమ్స్‌లో విజయవంతంగా 2 వేల కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలు చేసిన సందర్భంగా నిమ్స్‌ డాక్టర్లు, సిబ్బందిని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సత్కరించారు. ఈ మేరకు శనివారం నిమ్స్‌లో నిర్వహించిన…

    ప‌ర్యాట‌క కేంద్రాలుగా ఏపీలోని గ్రామాలు

    Spread the love

    Spread the loveపిలుపునిచ్చిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ అమ‌రావ‌తి : రాష్ట్రంలో విశిష్టతలు, ప్రత్యేకతలు కలిగిన గ్రామాలు ఎన్నో ఉన్నాయన్నారు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్. అయితే, పర్యాటకులు వాటిని చూడటానికి వెళ్ళినప్పుడు, అక్కడ సౌకర్యాల కొరత నిరాశకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *