ముదిరాజ్ కులాల‌ను బీసి -ఏ కేట‌గిరీలో చేర్చితే ఒప్పుకోం

బీసీ ఏ కులాల హక్కుల పరిరక్షణ సమితి ప్రకటన

హైద‌రాబాద్ : ముదిరాజ్ కులాల‌ను బీసి -ఏ కేట‌గిరీలో చేర్చితే ఒప్పుకోం అని స్ప‌ష్టం చేసింది బీసీ – ఏ కులాల హక్కుల పరిరక్షణ సమితి. తెలంగాణ బీసీ సంక్షేమ సలహాదారు, మాజీ మంత్రి, మాజీ ఎంపీ, బడుగు బలహీన వర్గాల నేత వి.హనుమంతరావుని కలిసి బీసీ ఏ కులాల తరఫున వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీసీ – ఏ కులాలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన వృత్తి ఆధారిత , సేవా కులాలుగా ఉన్నాయ‌ని పేర్కొన్నారు. స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఈ కులాలు అభివృద్ధికి సంబంధించి పూర్తి స్థాయిలో నోచుకోలేదని ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

సాంప్రదాయ వృత్తులు కోల్పోవడంతో బీసీ – ఏ కులాలకు చెందిన అనేక కుటుంబాలు నేడు దినసరి కూలీలు, ప్లంబర్లు, మేస్త్రీలు, ఆటో డ్రైవర్లు, చెత్త సేకరణ కార్మికులుగా జీవనం కొనసాగిస్తున్నాయని వాపోయింది. గ్లోబలైజేషన్ ప్రభావంతో వృత్తులు కోల్పోయిన పలువురు ఫుట్‌పాత్‌లపై వివిధ వస్తువులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారని వెల్ల‌డించింది. సంచార, అర్ధసంచార, భిక్షాటన ఆధారిత కులాలు కూడా బీసీ ఏలో ఉన్నాయని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీసీ – డీ వర్గంలో ఉన్న ముదిరాజ్ కులాలను బీసీ – ఏలో చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

  • Related Posts

    నిజామాబాద్ అభివృద్దికి క‌ట్టుబ‌డి ఉన్నా

    హైద‌రాబాద్ : టీపీసీసీ చీఫ్ , ఎమ్మెల్సీ మ‌హేష్ కుమార్ గౌడ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఉమ్మడి నిజామాబాద్ అభివృద్ధికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ మరో కీలక ముందడుగు వేశారు. జిల్లా…

    ఢిల్లీ ప‌ర్య‌ట‌నలో మంత్రి ఎస్. స‌విత బిజీ

    అమరావతి : రాష్ట్రానికి చెందిన టెక్స్ టైల్స్ ఉత్పత్తులు అమ్మకాలే లక్ష్యంగా రెండ్రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి గురువారం రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ ప్రగతి మైదానంలోని భారత్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *