కీలక వ్యాఖ్యలు చేసిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్
పంజాబ్ : ఐపీఎల్ 19 సీజన్ నుంచి తాము వైదొలగడం బాధగా ఉందన్నాడు పంజాబ్ కింగ్స్ ఎలెవన్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యారు. టోర్నీ ఆరంభంలో అదరగొట్టినా ఆ తర్వాత సెకండ్ సెషన్ లో తాము ఆశించిన మేర రాణించలేక పోయామన్నాడు. కొన్ని పొరపాట్లు జరిగాయని, కొందరు ఆటగాళ్ల పనితీరు ఆశించినంతగా లేకుండా పోవడం కూడా ఓడి పోయేందుకు ప్రధాన కారణమన్నాడు. నిన్న రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్ ఓడించడంతో పంజాబ్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఈ సందర్బంగా ప్లే ఆఫ్స్ కు చేరుకోక పోవడం పట్ల స్పందించాడు కెప్టెన్.
టాప్ 4కి అర్హత సాధించలేక పోవడం మా జట్టు మొత్తానికి నిజంగా చాలా నిరాశ కలిగించే విషయం. ఈ టోర్నమెంట్‌ను మేము ప్రారంభించిన తీరు చూస్తే, మేము అగ్ర స్థానాలకు వెలుపల నిలుస్తామని అస్సలు ఊహించలేదు. మేము మొదటి లేదా రెండవ స్థానాల్లోనే కొనసాగుతామని భావించామన్నాడు శ్రేయాస్ అయ్యర్. కానీ కొన్ని సందర్భాల్లో మేము చాలా పేలవమైన క్రికెట్ ఆడాం, దానివల్లనే మేము చివరి మ్యాచ్ వరకు ఏదోలా పోటీలో నిలదొక్కు కోగలిగాం. అయితే, రాజస్థాన్ విజయం సాధించడంతో, ఈ ఏడాది IPL నుండి మేము నిష్క్రమించాల్సి వచ్చింది. అయినప్పటికీ, జట్టు ప్రదర్శన కనబరిచిన తీరును నేను అభినందించాలని అనుకుంటున్నాను అన్నాడు.







