బౌల‌ర్ల భ‌ర‌తం ప‌ట్టిన వైభ‌వ్..అయినా త‌ప్ప‌ని ఓట‌మి

గుజ‌రాత్ టైటాన్స్ చేతిలో ఎలిమినేట‌ర్ -2 లో ప‌రాజ‌యం

మ‌ల్హాన్ పూర్ : ఐపీఎల్ -19 సీజ‌న్ లో వండ‌ర్ బాయ్ మ‌రోసారి రెచ్చి పోయాడు. గుజ‌రాత్ బౌల‌ర్ల భ‌ర‌తం ప‌ట్టాడు. వ‌చ్చీ రావ‌డంతోనే ఫోర్లు, సిక్స‌ర్ల వ‌ర్షం కురిపించాడు. త‌న ఆటతీరుతో బెంబేలెత్తి పోయారు. మ‌రోసారి త‌ను కేవ‌లం 4 ప‌రుగుల తేడాతో సెంచ‌రీ దూరం చేసుకున్నాడు. క‌న్నీటి ప‌ర్యంతం అయ్యాడు. ఈసారి టోర్నీలో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ జ‌ట్టు ఎలిమినేట‌ర్ వ‌ర‌కు చేరుకున్నదంటే దీనికి కార‌ణం ఒకే ఒక్క‌డు వైభ‌వ్ సూర్య‌వంశీ. త‌ను మొన్న‌టికి మొన్న కేవ‌లం 3 ప‌రుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు.

వైభ‌వ్ సూర్య‌వంశీ ఏ ఒక్క‌రినీ వ‌ద‌ల‌లేదు. ఫోర్లు, సిక్స‌ర్ల‌తో విరుచుకు ప‌డ్డాడు. కేవ‌లం 47 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని 8 ఫోర్లు 7 సిక్స‌ర్ల‌తో 96 ర‌న్స్ చేశాడు. ఈ ఐపీఎల్ సీజ‌న్ లో త‌న‌కు మ‌రోసారి సెంచరీ చేజారింది. ఆఖ‌రులో వ‌చ్చిన ఫెరీరా చక్క‌లు చూపించాడు. ఇక ర‌వీంద్ర జ‌డేజా గాయం నుంచి కోలుకుని ప‌రుగులు చేయ‌డంతో 214 ర‌న్స్ చేసింది. అనంత‌రం గిల్ సెంచ‌రీతో క‌దం తొక్కాడు. త‌ను 53 బంతులు ఎదుర్కొని 15 ఫోర్లు 3 సిక్స‌ర్ల‌తో 104 ర‌న్స్ చేసి ఔట్ అయ్యాడు. సాయి సుద‌ర్శ‌న్ 32 బంతుల్లో 8 ఫోర్లు 1 సిక్స్ తో 58 ప‌రుగులు చేశాడు. దీంతో సునాయసంగా గుజ‌రాత్ గెలుపొందింది. ఫైన‌ల్ కు అర్హ‌త సాధించింది.

  • Related Posts

    వైభ‌వ్ సూర్య‌వంశీ ఎంపిక క‌రెక్టు కాదు

    హైద‌రాబాద్ : ప్ర‌ముఖ క్రికెట్ అనలిస్ట్, కామెంటేట‌ర్ హ‌ర్ష భోగ్లే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇంగ్లండ్ టూర్ లో భాగంగా శ్రేయ‌స్ అయ్య‌ర్ నాయ‌క‌త్వంలో టీమిండియా టి20 సీరీస్ ను కోల్పోయింది. ఆఖ‌రి మ్యాచ్ లోనూ చేతులెత్తేశారు. ప్ర‌ధాన ఆట‌గాళ్లు ఆశించిన…

    వ‌చ్చే ఐపీఎల్ సీజ‌న్ లో ఎంఎస్ ధోనీ ఆడ‌టం క‌ష్ట‌మే

    చెన్నై : భార‌త దేశ క్రికెట్ రంగంలో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన ఏకైక క్రికెట‌ర్ జార్ఖండ్ డైన‌మెట్ మ‌హేంద్ర సింగ్ ధోనీ. త‌న సార‌థ్యంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ ప‌లుమార్లు ఐపీఎల్ టైటిళ్ల‌ను స్వంతం చేసుకుంది. ప‌లువురిని మార్చింది సీఎస్కే యాజ‌మాన్యం.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *