రాజ‌స్తాన్ రాయ‌ల్స్ కెప్టెన్ ప‌రాగ్ ఔట్ ..?

Spread the love

కొత్త యాజ‌మాన్యం సంచ‌ల‌న నిర్ణ‌యం

జైపూర్ : ఐపీఎల్ 19వ సీజ‌న్ ఆఖ‌రి అంకానికి చేరువ‌లో ఉంది. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్ల మ‌ధ్య పోరు కొన‌సాగ‌నుంది. ఎవ‌రు టైటిల్ విజేత అనేది ఈనెల 31న ఆదివారం గుజ‌రాత్ రాష్ట్ర రాజ‌ధాని అహ్మ‌దాబాద్ వేదిక‌గా తేలి పోనుంది. ఇప్ప‌టికే టికెట్లు కూడా పూర్తిగా అమ్ముడు పోయాయి. ఇక అనూహ్యంగా ఈసారి సీజ‌న్ లో అద్బుతంగా ఆడింది రాజ‌స్థాన్ రాయ‌ల్స్. అయితే కెప్టెన్ గా రియాన్ ప‌రాగ్ దుందుడుకు స్వ‌భావం, జ‌ట్టులోని ప‌లు ఆట‌గాళ్ల మ‌ధ్య స‌ఖ్య‌త లేకుండా చేసింద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

ఈ త‌రుణంలో ల‌క్నో జెయింట్స్ యాజ‌మాన్యం మారింది. కొత్త మేనేజ్మెంట్ ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకునేందుకు రెడీ అయ్యింది. వచ్చే సీజన్‌లో కొత్త యజమాని జట్టు బాధ్యతలను స్వీకరించనున్నారు. ప్ర‌స్తుతం కెప్టెన్ గా ఉన్న‌ రియాన్ పరాగ్ కెప్టెన్‌గా ఉండరని ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతే కాకుండా కుమార్ సంగక్కరతో పాటు సహాయక సిబ్బంది అంతా మారే అవకాశం ఉందని స‌మాచారం. యశస్వి జైస్వాల్ , రవీంద్ర జడేజా RR జట్టును వీడే అవకాశం ఉంది. ‘యాషెస్’ టెస్ట్ సిరీస్ కారణంగా వచ్చే సీజన్‌లో జోఫ్రా ఆర్చర్ అందుబాటులో ఉండడు.షిమ్రాన్ హెట్‌మైర్, సందీప్ శర్మ , రవి బిష్ణోయ్ కూడా జట్టులో ఉండరని టాక్.

  • Related Posts

    ల‌క్నో జ‌ట్టు నుంచి పంత్ కు ఉద్వాస‌న

    Spread the love

    Spread the loveత‌న స్థానంలో హార్దిక్ పాండ్యాకు ఛాన్స్ ల‌క్నో : ఐపీఎల్ 19వ సీజ‌న్ లో ఆశించిన రీతిలో ఆడ‌లేక పోయింది రిష‌బ్ పంత్ సార‌థ్యంలోని ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ టీం. పాయింట్ల ప‌ట్టిక‌లో ఆఖ‌రు స్థానంలో నిలిచింది. ఐపీఎల్…

    బౌల‌ర్ల భ‌ర‌తం ప‌ట్టిన వైభ‌వ్..అయినా త‌ప్ప‌ని ఓట‌మి

    Spread the love

    Spread the loveగుజ‌రాత్ టైటాన్స్ చేతిలో ఎలిమినేట‌ర్ -2 లో ప‌రాజ‌యం మ‌ల్హాన్ పూర్ : ఐపీఎల్ -19 సీజ‌న్ లో వండ‌ర్ బాయ్ మ‌రోసారి రెచ్చి పోయాడు. గుజ‌రాత్ బౌల‌ర్ల భ‌ర‌తం ప‌ట్టాడు. వ‌చ్చీ రావ‌డంతోనే ఫోర్లు, సిక్స‌ర్ల వ‌ర్షం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *