
800 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయం, ప్రసిద్ద పుణ్య క్షేత్రంగా భాసిల్లుతూ వచ్చింది కర్ణాటక లోని ధర్మస్థల్ (ధర్మస్థలం) . ప్రస్తుతం జైన్ లకు చెందిన వారి ఆధీనంలో కొనసాగుతోంది. ఈ ఆలయానికి చెందిన వ్యక్తే ఇప్పుడు పెద్దల సభలో కొలువు తీరాడు. ఆయనకు జాతీయ స్థాయిలో పురస్కారం కూడా లభించింది. గత కొన్నేళ్లుగా ఇక్కడ దర్శించుకునే భక్తులలో చాలా మంది కనిపించకుండా పోతున్నారని, మాయమై పోతున్నారని, మరికొందరు చిరునామా లేని చావులకు లోనవుతున్నారని ఆరోపణలు వచ్చాయి. ఒకటి కాదు రెండు కాదు వందలాది మంది ఇక్కడ చంప బడుతున్నారని, దీని వెనుక కొందరి హస్తం ఉందంటూ విమర్శలు కూడా వచ్చాయి. ఆందోళనలు కూడా జరిగాయి. కొన్నేళ్లుగా ఈ తంతు నిరాటంకంగా కొనసాగుతోందని, కానీ దీని వనుక పెద్దల హస్తం దాగి ఉందని, ఇక్కడ ఎవరి ఆధిపత్యం చెల్లుబాటు కాదని, అక్కడికి వెళితే బయటకు రావడం కష్టమని స్థానికులు చెబుతున్నారు. ఈ సమయంలో ఉన్నట్టుండి ధర్మస్థలలో పారిశుధ్య కార్మికుడిగా పని చేసిన విజిల్ బ్లోయర్ అనే వ్యక్తి బయటకు వచ్చాడు. తను చని పోయినా పర్వాలేదు కానీ అమాయకులైన పిల్లలు, యువతులు, మహిళలు బలి కాకూడదని ఉన్న విషయాన్ని బహిరంగంగా చెప్పేశాడు.
తనకు పిచ్చి పట్టిందని, ఇదంతా కేవలం ప్రచారం కోసం చేస్తున్నదంటూ కొందరు కొట్టి పారేశారు. కానీ ధర్మస్థలంలో చివరకు తన మనవరాలిపై కూడా కన్నేశారంటూ వాపోయాడు. బయటకు రాక పోతే, చెప్పకపోతే ఇంకెన్ని దారుణాలు చవి చూడాల్సి వస్తుందోనని బాధ పడ్డాడు. చివరకు ప్రాణం పోయినా సరే తాను చేసిన పనుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ నమ్మలేదు. పైగా ధర్మస్థల నిర్వాహకులకు ఈ విషయాన్ని చేరవేశారు . తనకు బెదిరింపులు కూడా వచ్చాయి. అయినా వెనుకంజ వేయలేదు. బహుళ హత్యలు, అత్యాచారాల గురించి తన వద్ద పూర్తి వివరాలు ఉన్నాయని, తాను చూపిస్తానంటూ ప్రకటించాడు. ఈ దారుణ ఘటనలన్నీ 1995 నుండి 2014 వరకు జరిగినవే కావడం గమనార్హం. మృతదేహాలను ఖననం చేసిన ప్రదేశాలను కూడా చూపించాడు. తనకు రక్షణ కల్పిస్తే మరిన్ని వాస్తవాలను మీ ముందు పెడతానని చెప్పాడు. ఒక దశాబ్దం తర్వాత బయటకు రావడం , దేని కోసమన్న అనుమానం కలిగింది. దీనికి సమాధానంగా పశ్చాతాపంతోనే తాను ముందుకు వచ్చానని వెల్లడించాడు.
దీంతో దేశ వ్యాప్తంగా ఇది కలకలం రేపింది. గత్యంతరం లేక ధర్మస్థల పోలీసులు కేసు నమోదు చేవారు. అనేక మృత దేహాలను బలవంతంగా ఖననం చేయాల్సి వచ్చిందని కన్నీటి పర్యంతం అయ్యాడు. చిన్నారులు, ఎలాంటి అచ్చాదనలు లేని యువతులు, మహిళలపై గాట్లు, చెప్పలేని రీతిలో దారుణంగా హింసించారంటూ బోరుమన్నాడు. ఈ చేతులతో కొందరిని పాతి పెట్టానని, మరికొందరిని కాల్చేశానని తెలిపాడు. వీటిపై విచారణ జరిపించాలని కోరాడు. బీఎన్ఎస్ 211(ఏ) కింద క్రైమ్ నెంబర్ 25 కింద కేసు నమోదు చేశారు. కోర్టు అనుమతి పొందిన తర్వాత విచారణ ప్రారంభించారు. ఓజస్వి గౌడ, దేశ్ పాండే న్యాయవాదులు తనకు మద్దతుగా నిలిచారు. ప్రాణానికి, కుటుంబానికి ముప్పు ఉంటుందనే భయంతో భయంతో తాను పక్క రాష్ట్రానికి పారి పోయానని తెలిపాడు . 1998లో మృత దేహాలను ఖననం చేసేందుకు నిరాకరించానని, పోలీసులకు చెప్పాలని కోరితే ఆలయ సూపర్ వైజర్ తనను కొట్టారని వాపోయాడు. డీజిల్ ఉపయోగించి కొన్నింటిని తగుల బెట్టానని చెప్పాడు.
కాగా ధర్మస్థల వ్యవహారాలకు సంబంధించి గతంలో కూడా విస్తు పోయే దారుణాలు వెలుగు చూశాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. దీంతో ఆలయాన్ని నడిపే వీరేంద్ర హెగ్డే ముందు జాగ్రత్తగా గ్యాగ్ ఆర్డర్ ను తీసుకు వచ్చాడు. తమకు వ్యతిరేకంగా ఉన్న వాటిని తీసి వేయించాడు. ఇదే సమయంలో గౌరీ లంకేష్ ను దారుణంగా చంపారు. ఆమె కూడా ఈ దారుణాల గురించి ప్రశ్నించింది. కాగా ధర్మస్థల సమాధుల కేసుకు సబంధించిన 8,842 లింకులను తొలగించాలని గ్యాగ్ ఆర్డర్ జారీ చేయడాన్ని సవాల్ చేశారు జర్నలిస్ట్ నవీన్ సూరింజే, మునీర్ కాటిపల్ల, బైరప్ప హరీస్ కుమార్ .ఇదే సమయంలో న్యాయమూర్తి విజయ్ కుమార్ రాయ్ గురించి కూడా తెలుసు కోవాలి. తను 1995, 1998 మధ్య దర్మస్థల మంజునాథేశ్వర ట్రస్ట్ నిర్వహిస్తున్న మంగళూరు లోని ఎస్డీఎం కాలేజీలో చదువుకున్నారు. తను ధర్మస్థలకు మద్దతుగా తీర్పు చెప్పారన్న ఆరోపణలు చేశారు జర్నలిస్ట్. హర్షేంద్ర కుమార్ లా కాలేజీ నిర్వహణ బోర్డులో కార్యదర్శిగా ఉన్నారు. సోదరుడు వీరేంద్ర హెగ్డే అధ్యక్ష పదవిలో ఉంటూనే ధర్మస్థలంలోని మంజునాథ ఆలయానికి ధర్మాధికారి కూడా.
ఇదంతా పక్కన పెడితే ధర్మస్థల దారుణాల గురించి సంచలనంగా మారడంతో గత్యంతరం లేక కాంగ్రెస్ సర్కార్ విచారణకు ఆదేశించింది. సిట్ ను ఏర్పాటు చేసింది. కానీ వాస్తవాలు వెలుగు చూడాలంటే చాలా కాలం పడుతుంది. అంతలోపే ఆధారాలు ఆనవాళ్లు లేకుండా చేసే ప్రమాదం లేక పోలేదు. ఈ సమయంలో భారీ భద్రత నడుమ విజిల్ బ్లోయర్ ను వెంట పెట్టుకుని న్యాయవాది సహకారంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మొదట తనిఖీలు చేపట్టగా దొరకలేదు. కానీ తర్వాత పెద్ద ఎత్తున ఎముకలు, అస్తిపంజరాలు కనిపించాయి. దర్మస్థలం పక్కనే నది కూడా ఉంది. ఇది చోటు చేసుకున్న దారుణాలకు సాక్షిభూతంగా నిలుస్తోంది. ఈ ఆలయానికి ధర్మకర్తగా ఉన్నది బీజేపీకి చెందిన వ్యక్తి కావడంతో ఈ కేసు నీరుగారి పోయే ప్రమాదం ఉందన్న అనుమానం వ్యక్తం అవుతోంది. ఏ చిన్న సంఘటన జరిగినా నోరు తెరిచే హిందూ వాదులు, మోదీ, అమిత్ షా, యోగి, మోహన్ భగవత్, కేఎల్ సంతోష్ , స్వామీజీలు, మఠాధితులు ఎందుకు ఈ ధర్మస్థల దారుణాలపై మాట్లాడటం లేదో చెప్పాలి. దీనికి రాజకీయ రంగు రుద్దడం కాకుండా అసలు వాస్తవాలు వెలుగు చూసేందుకు సిద్దరామయ్య యత్నం చేయాలి. చని పోయిన బాధిత కుటుంబాలకు కనీసం ఆనవాళ్లు దొరికేలా చేస్తే ధర్మస్థలం పరువు నిలుస్తుంది.