ర‌జ‌నీకాంత్ తో క‌లిసి అన్నామ‌లై కొత్త పార్టీ..?

త‌మిళ‌నాడులో సంచ‌ల‌నంగా మారిన వైనం

చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్రంలో రాజ‌కీయాలు మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. ద్ర‌విడ పార్టీల‌తో పాటు ఇంకొన్ని పార్టీలు కొత్త‌గా రానున్నాయి. ఇప్ప‌టికే అగ్ర న‌టుడు విజ‌య్ పార్టీ స్తాపించాడు. ఏకంగా 108 స్థానాలు సాధించి కాంగ్రెస్, వీసీకే, ఐయుఎంఎల్ , త‌దిత‌ర పార్టీల‌తో కలిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశాడు. దీంతో మ‌రో పార్టీకి స్కోప్ ఉంద‌ని భావించాడు భార‌య‌త జ‌న‌తా పార్టీ మాజీ చీఫ్ కుప్పుస్వామి అన్నామ‌లై. త‌న‌ను ప‌క్క‌న పెట్ట‌డం ప‌ట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న త‌ను ఉన్న‌ట్టుండి షాక్ ఇచ్చాడు. పార్టీకి రాజీనామా చేశాడు. త‌న రాజీనామాను బీజేపీ ఆమోదించింది. ఆయ‌న ఢిల్లీ నుంచి నేరుగా చెన్నైకి చేరుకున్నాడు. ఈ సంద‌ర్బంగా అన్నామ‌లైకి ఘ‌న స్వాగ‌తం ల‌భించింది.

ఈ త‌రుణంలో తాను కొత్త పార్టీ పెట్ట‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. అయితే ఇప్ప‌టికే పార్టీ పెట్టాల‌ని అనుకుని ఆగి పోయిన మ‌రో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ తో క‌లిసి అన్నామ‌లై పార్టీకి శ్రీ‌కారం చుడ‌తార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్‌ను తన వ్యక్తిగత గురువుగా, ఆధ్యాత్మిక మార్గదర్శిగా అన్నామలై బహిరంగంగానే పేర్కొన్నారు. ఆయన తరచుగా రజనీని కలుస్తుంటారు, వారి నుంచి స్ఫూర్తి పొందుతుంటారు.ఇప్పుడు బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత, కొత్త పార్టీ ఏర్పాటు కోసం వీరిద్దరి మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉందన్న తాజా వార్తలు వినిపిస్తున్నాయ.

  • Related Posts

    సీఈసీ వ్య‌వ‌హారంపై నోరు మెద‌ప‌ని విజ‌య్

    చెన్నై : త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు డీఎంకే ఎంపీ క‌నిమొళి. విజయ్‌ను ఉద్దేశించి “ప్రియమైన తమ్ముడు విజయ్” అని పిలిచారు. అంద‌రినీ ఆశ్చ‌ర్య పోయేలా చేశారు. దేశ వ్యాప్తంగా ప్ర‌స్తుతం కేంద్ర ఎన్నిక‌ల…

    ఏపీ డిజిట‌ల్ కార్పొరేష‌న్ కు గోల్డ్ అవార్డు

    అమ‌రావ‌తి : రాజ‌కీయ రంగంలో అపార‌మైన అనుభ‌వం క‌లిగిన , పాల‌నా ప‌రంగా త‌న‌దైన ముద్ర వేసేలా ప్ర‌య‌త్నం చేసిన ఘ‌న‌త ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుది. ఆయ‌న వ‌య‌సు 75 ఏళ్లు అయినా ఇప్ప‌టికీ కుర్రాళ్ల తో పోటీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *