తన పర్ ఫార్మెన్స్ బాగుందని ఎంపిక చేశాం
ముంబై : టీమిండియా టి20 జట్టు స్కిప్పర్ గా ఎవరూ ఊహించని విధంగా శ్రేయస్ అయ్యర్ కు దక్కింది. ఈ విషయాన్ని బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గంభీర్ జట్టును ప్రకటించారు. అంతే కాకుండా సంజు శాంసన్ ను కాదని తిలక్ వర్మకు ఎందుకు వైస్ కెప్టెన్సీ ఇచ్చారన్న దానికి కూడా చాలా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు కోచ్ గంభీర్. ఇండియా జట్టుకు రెండుసార్లు టి20 వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ను ఎందుకు తప్పించాల్సి వచ్చిందని ప్రశ్నించింది మీడియా. దీనికి సమాధానం ఇచ్చేందుకు దాట వేశాడు .
ఇంతకు ముందు 15 మంది సభ్యుల జట్టులో కూడా లేని శ్రేయస్ అయ్యర్‌ను ఏ ప్రాతిపదికన కెప్టెన్‌గా నియమించారని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు గంభీర్. శ్రేయస్ తన దేశీయ క్రికెట్ తో పాటు ఇటీవలి ఐపీఎల్ లో మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. కెప్టెన్ గా, వ్యక్తిగతంగా కూడా అందుకే తనను కెప్టెన్ గా ఎంపిక చేశామన్నాడు. తిలక్ వర్మను వైస్-కెప్టెన్‌గా ఎందుకు పదోన్నతి కల్పించారన్న ప్రశ్నకు తిలక్ అద్భుతమైన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించాడు. అతను ఇండియా ‘ఎ’ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆసియా క్రీడల జట్టులో కూడా ఉన్నాడని, . అతన్ని భవిష్యత్ నాయకుడిగా చూస్తున్నామన్నాడు.





