నాకు విరాట్ కోహ్లీ అంటే చ‌చ్చేంత ఇష్టం

Spread the love

రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు టీం కూడా

బీహార్ : ఐపీఎల్ స్టార్ క్రికెట‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ప్ర‌స్తుతం ఫుల్ ఎంజాయ్ లో ఉన్నాడు . త‌న‌ను బీసీసీఐ టి20 జ‌ట్టులోకి తీసుకుంది. ఈ సంద‌ర్బంగా ఓ ఛాన‌ల్ తో చిట్ చాట్ చేశాడు. ప‌లు ప్రశ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చాడు. తాను ఒకప్పుడు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టుకు సపోర్టర్ అని చెప్పాడు వైభ‌వ్ సూర్య వంశీ. ఎప్పటికీ కోహ్లీకి అభిమానినని వైభవ్ సూర్యవంశీ వెల్లడించారు. IPL సందర్భంగా విరాట్ తన భుజంపై చేయి వేసి మాట్లాడటం ఒక కలలా అనిపించిందన్నారు.

ఆయన తనను తమ్ముడిలా ట్రీట్ చేశారని రాజస్థాన్ రాయ‌ల్స్ విడుదల చేసిన ఓ వీడియోలో పేర్కొన్నారు. ‘కోహ్లీ నాకు అన్ని విషయాలు అర్థమయ్యేలా చెప్పారు. లోపాలు, బలాల గురించి వివరించారు. దేనిపై దృష్టిపెట్టాలో చెప్పిన తీరు అద్భుతం’ అని తెలిపాడు సూర్య‌వంశీ. ఇదిలా ఉండ‌గా తాజాగా ఇండియాలో జ‌రిగిన జ‌నాద‌ర‌ణ పొందిన ఐపీఎల్ 19వ సీజ‌న్ లో అత్య‌ధిక ప‌రుగులు చేశాడు రాజ‌స్తాన్ రాయ‌ల్స్ త‌ర‌పున‌. అంతే కాదు 76 సిక్సుల‌తో రికార్డు సృష్టించాడు. ఫోర్లు, సిక్సుల‌తో హోరెత్తించాడు. టాప్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు.

  • Related Posts

    భారత మ‌హిళా ఫుట్‌బాల్ జ‌ట్టుకు మోదీ కంగ్రాట్స్

    Spread the love

    Spread the loveశాఫ్ మ‌హిళా ఛాంపియ‌న్ షిప్ కైవ‌సం చేసుకున్న టీం న్యూఢిల్లీ : గోవాలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 3-1 తేడాతో ఘనవిజయం సాధించడం ద్వారా, భారత్ ఆరవసారి,, ఏడేళ్ల విరామం తర్వాత మొదటిసారిగా SAFF మహిళా ఛాంపియన్‌షిప్…

    శ్రేయ‌స్ అయ్య‌ర్ కెప్టెన్సీపై గంభీర్ కామెంట్స్

    Spread the love

    Spread the loveత‌న ప‌ర్ ఫార్మెన్స్ బాగుంద‌ని ఎంపిక చేశాం ముంబై : టీమిండియా టి20 జ‌ట్టు స్కిప్ప‌ర్ గా ఎవ‌రూ ఊహించ‌ని విధంగా శ్రేయ‌స్ అయ్య‌ర్ కు ద‌క్కింది. ఈ విషయాన్ని బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ అజిత్ అగార్క‌ర్,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *