రామోజీరావుకు సీఎం చంద్ర‌బాబు నివాళి

Spread the love

ఆయ‌న చేసిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం

అమ‌రావ‌తి : అక్షర యోధుడు రామోజీరావు వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడు అని పేర్కొన్నారు. మీడియా రంగంలో ఓ యుగకర్త, అక్షర యోధుడు రామోజీరావు గారి 2వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు. సామాన్య కుటుంబం నుంచి అసామాన్య శిఖరాలను అధిరోహించి, మీడియాను ప్రజా చైతన్యానికి వేదికగా మలిచిన ఆయన సేవలు చిరస్మరణీయం అని ప్ర‌శంసించారు సీఎం.

విలువలు, క్రమశిక్షణ, నిబద్ధత, ధైర్యసాహసాలతో నడిచిన ఆయన ప్రస్థానం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంద‌న్నారు నారా చంద్ర‌బాబు నాయుడు. పత్రికా రంగం అంటే వ్యాపారం కాదు…సామాజిక బాధ్యత అని భావించి ఆచరించి చూపిన ఆదర్శవాది రామోజీ రావు అని పేర్కొన్నారు. తెలుగు ప్రజలు గర్వించే మీడియా సంస్థలను అందించిన ఆయన స్థానం ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచి పోతుంద‌న్నారు సీఎం. రామోజీరావు కీర్తి అజరామరం. వారి వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్కరం స్మరించుకుందాం అని పిలుపునిచ్చారు నారా బాబు.

  • Related Posts

    కేంద్రం నిర్వాకంపై ఇండియా కూట‌మి యుద్దం

    Spread the love

    Spread the loveస్పష్టం చేసిన కూట‌మి పార్టీ నేత‌ల వార్నింగ్ న్యూఢిల్లీ : దేశ రాజ‌ధాని ఢిల్లీలో సోమ‌వారం కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో ‘ఇండియా’ (INDIA) కూటమికి సంబంధించిన ఒక ముఖ్యమైన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీపీపీ (CPP) చైర్‌పర్సన్ సోనియా…

    బీహార్‌లో నెల్లూరు యాత్రికుల బస్సు ప్రమాదం

    Spread the love

    Spread the loveబాధాక‌ర‌మ‌న్న మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ రెడ్డి తాడేప‌ల్లి గూడెం : బీహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్ సమీపంలో నెల్లూరు జిల్లా నుంచి కాశీయాత్రకు వెళ్తున్న ప్రైవేట్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు భక్తులు మృతి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *