శివసేన యుబిటీ నాయకురాలు ప్రియాంక చతుర్వేది
ముంబై : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ , సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను చిన్నకారణం పేరుతో తిరస్కరించడం పట్ల స్పందించారు శివసేన (UBT) నాయకురాలు ప్రియాంక చతుర్వేది. “ఈ తిరస్కరణ దురదృష్టకరం. నామినేషన్ను తిరస్కరిస్తూ రిటర్నింగ్ ఆఫీసర్ పేర్కొన్న కారణాలను బట్టి చూస్తే, ఈ నిర్ణయం కొంతవరకు రాజకీయ ప్రేరేపితమని అనిపిస్తోంది అని అన్నారు. ఇవాళ ఆమె మీడియాతో ముంబైలో మాట్లాడారు. అయితే, ఇక్కడ మరో ప్రశ్న కూడా తలెత్తుతోంది: మీనాక్షి నటరాజన్ గతంలో లోక్సభ సభ్యురాలిగా పనిచేశారు.
మరి ఆమె నామినేషన్ పత్రాలను నింపిన వ్యక్తి దీనిపై తగిన శ్రద్ధ వహించలేదా? లోక్సభ అయినా లేదా రాజ్యసభ అయినా, భారతీయ జనతా పార్టీతో ప్రత్యక్ష పోరుకు సిద్ధమవుతున్నప్పుడు, నామినేషన్ తిరస్కరణకు గురయ్యేలా ఇలాంటి చిన్న చిన్న లోపాలకు అవకాశం ఇవ్వడం నిజంగా దురదృష్టకరం అని అన్నారు ప్రియాంక చతుర్వేది. జరిగిన లోపాలపై ఎన్నికల సంఘం దృష్టి సారిస్తుందని, అలాగే కాంగ్రెస్ దీనిని న్యాయస్థానంలో సవాలు చేస్తుందని నేను ఆశిస్తున్నానని అన్నారు. ఎందుకంటే ఇది రాజకీయ ప్రేరేపిత చర్యే తప్ప, రాజ్యాంగపరంగా సరైనది కానే కాదన్నారు.





