జి7 స‌ద‌స్సు కోసం ఫ్రాన్స్ కు వెళ్లిన మోదీ

స్లోవేకియా లో కూడా ప‌ర్య‌టించ‌నున్న పీఎం

న్యూఢిల్లీ : భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ జీ 7 స‌ద‌స్సుకు హాజ‌ర‌య్యేందుకు ఫ్రాన్స్ కు బ‌య‌లుదేరి వెళ్లారు. ఇదే స‌మ‌యంలో ఫ్రాన్స్ తో పాటు స్లోవేకియా పర్యటనకు వెళ్లారు. ఈ ఏడాది ప్రారంభంలో అధ్యక్షుడు మాక్రాన్ భారత్‌ను సందర్శించారు, అప్పుడు తమ‌ సంబంధాలను ‘ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి పెంచామని పేర్కొన్నారు. ఈ టూర్ సంద‌ర్బంగా ఇరు దేశాల‌లో ఏడు రోజుల పాటు ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ ద్వైపాక్షిక, ప్రపంచ అంశాలపై ప్రపంచ నాయకులతో చర్చలు జరుపుతారు. బయలుదేరే ముందు ఇచ్చిన ప్రకటనలో, భారత వ్యూహాత్మక దృక్పథంలో ఫ్రాన్స్‌కు ప్రత్యేక స్థానం ఉందని మోదీ పేర్కొన్నారు.

అలాగే, 1993లో స్లోవేకియా స్వతంత్ర దేశంగా ఏర్పడిన తర్వాత ఒక భారత ప్రధాన మంత్రి ఆ దేశాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి కావడం ఒక చారిత్రక మైలురాయి అని, ఇది ద్వైపాక్షిక సంబంధాలలో పెరుగుతున్న సానుకూలతను మరింత బలపరుస్తుందని ఆయన అన్నారు. భారత వ్యూహాత్మక దృక్పథంలో ఫ్రాన్స్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో అధ్యక్షుడు మాక్రాన్ భారత్‌ను సందర్శించారు, అప్పుడు మేము మా సంబంధాలను ‘ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచామని పేర్కొన్నారు ప్ర‌ధాని మోదీ.

  • Related Posts

    అగ్నిమాప‌క సిబ్బంది ప‌నితీరు భేష్ : అనిత వంగ‌ల‌పూడి

    అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర హోం, విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖ‌ల మంత్రి వంగ‌ల‌పూడి అనిత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో అగ్ని మాప‌క శాఖ‌లో ప‌ని చేస్తున్న సిబ్బంది, ఉద్యోగుల ప‌నితీరు అద్భుతంగా ఉందంటూ ప్ర‌శంసలు కురిపించారు. సోమ‌వారం విజయనగరం జిల్లాలో…

    జ‌గ‌న్ రెడ్డి ఆరోప‌ణ‌లు అవాస్త‌వం : డోలా శ్రీ బాల

    అమ‌రావ‌తి : మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి నిప్పులు చెరిగారు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై. ఆయ‌న చేస్తున్న ఆరోప‌ణ‌లలో వాస్త‌వం లేద‌న్నారు. సోమ‌వారం మంత్రి మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం సర్వీస్ రూల్స్ లేకుండా, నిర్దిష్ట…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *