ఎంపీ మహూవా మొయిత్రా కామెంట్స్
న్యూఢిల్లీ : తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ మహూవా మోయిత్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె ఓ ఛానల్ తో చిట్ చాట్ చేశారు. తాను చిన్నతనంలో హిందీ చదువుకున్నాను, చాలా ఏళ్లు విదేశాల్లో నివసించాను, మా ఇంట్లో అందరూ ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతారని చెప్పారు. నేను ఎన్నికైన ప్రాంతంలో బెంగాలీ మాట్లాడతారు, బెంగాల్ అసెంబ్లీలో నేను బెంగాలీలోనే మాట్లాడేదానని అన్నారు ఎంపీ. లోక్‌సభలో నేను ఇంగ్లీష్‌లో మాట్లాడతానని చెప్పారు. మనసులోంచి వచ్చే భావాలు ఇంగ్లీష్ లేదా బెంగాలీలో బయటకు వస్తాయని అన్నారు.
భారతదేశంలోని దక్షిణ, తూర్పు రాష్ట్రాల్లో హిందీ మాట్లాడరు, అందుకే లోక్‌సభలో నేను ఇంగ్లీష్‌లో మాట్లాడతానని చెప్పారు మహూవా మోయిత్రా. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన నా స్నేహితులు చాలామంది “మీరు మా తరపున గళమెత్తుతున్నారు” అని అంటుంటారని చెప్పారు. కానీ ఇప్పుడు రాబోయే ఐదేళ్లలో, హిందీ భాషపై మంచి పట్టు సాధించేలా తాను సిద్దం అవుతున్నట్లు పేర్కొన్నారు ఎంపీ.





