తెలంగాణ నుంచి ఊహించని ప్రపోజల్
న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ గా ఉన్న మీనాక్షి నటరాజన్ మధ్య ప్రదేశ్ లో రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ సంచలనంగా మారింది. తెలంగాణ నుంచే తనపై కేసు నమోదైనట్లు ఫిర్యాదు అందడంతో ఉన్నట్టుండి ఎన్నికల అధికారి నటరాజన్ నామినేషన్ ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. విచిత్రం ఏమిటంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 63 సీట్లు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి. మూడు రాజ్యసభ సీట్లకు గాను వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి రావాల్సి ఉంది. కానీ ఉన్నట్టుండి తన నామినేషన్ రిజెక్ట్ కావడంతో ఉన్నట్టుండి రావాల్సిన రాజ్యసభ సీటు కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది.ఆ మూడు సీట్లు తన పరం అయ్యాయి. దీని వెనుక సీఎం రేవంత్ రెడ్డి హస్తం ఉన్నట్లు ఆరోపణలు కూడా వచ్చాయి.
రేవంత్ రెడ్డికి రైట్ హ్యాండ్ గా ఉన్న ఫహీం ఖురేషీ మీనాక్షి నామినేషన్ తిరస్కరణ వెనుక కుట్రకు తెర లేపాడని ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయం పై హైకమాండ్ సీరియస్ అయ్యింది. దీంతో రేవంత్ రెడ్డికి ఝలక్ ఇస్తూ తెలంగాణ నుంచి మీనాక్షిని రాజ్యసభకు పంపాలనే ఒక కొత్త ప్రతిపాదన ఊహించని విధంగా తెరపైకి వచ్చినట్లు సమాచారం. పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మీనాక్షి నటరాజన్‌ను రాజ్యసభకు పంపే మార్గాలను పార్టీ అధిష్ఠానం పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఉన్న నలుగురు సభ్యులలో ఒకరు తమ స్థానాన్ని ఖాళీ చేస్తే, మీనాక్షికి మార్గం సుగమం అవుతుందని పార్టీ నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌కు అత్యంత సన్నిహితులుగా భావించే ఇద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.






