బేష‌ర‌తుగా ధ‌రేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాలి

ప‌ర్యావ‌ర‌ణ కార్య‌క‌ర్త సోన‌మ్ వాంగ్ చుక్ డిమాండ్

హైద‌రాబాద్ : ప‌ర్యావ‌ర‌ణ కార్య‌క‌ర్త‌, ఉద్య‌మ‌కారుడు, ప్ర‌కృతి ప్రేమికుడు సోన‌మ్ వాంగ్ చుక్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్ర‌ధాన్ బేష‌రతుగా రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తూ ఆదివారం హైద‌రాబాద్ లోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద ఆందోళ‌న చేపట్టారు. భారీ ఎత్తున యువ‌త చేరుకున్నారు. వాంగ్ చుక్ తో పాటు బుద్ది జీవులు, మేధావులు, ప్ర‌జాస్వామిక‌వాదులు, పౌర స‌మాజం, జ‌ర్న‌లిస్టులు హాజ‌ర‌య్యారు. వాంగ‌గ్ చుక్ తో పాటు మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ రావు కూడా ప్ర‌సంగించారు. ఇదిలా ఉండ‌గా తాను విద్యాశాఖ మంత్రిని కావాల‌ని యువ‌త కోర‌డం న‌చ్చ‌లేద‌న్నారు వాంగ్ చుక్. ఒకరి స్థానంలో మరొకరు వచ్చి ఆ కుర్చీని ఆక్రమించడం గురించి ఈ ఉద్యమం జరగడం లేదన్నారు.

ఇది రాజకీయ వేదిక కాదు. ఇది ఒక చైతన్య ఉద్యమం అని స్ప‌ష్టం చేశారు. యువత నాయకత్వం వహించాలి. నాలాంటి వాళ్లు కేవలం వారికి మార్గనిర్దేశం చేయడానికి, వారికి అండగా నిలవడానికి మాత్రమే ఇక్కడ ఉన్నామ‌ని ప్ర‌క‌టించారు . బొద్దింక జనతా పార్టీ నిరసన కార్య‌క్ర‌మంలో నిరసనకారులు కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ప్రధాన్ రాజీనామా కోరుతూ ఈ ఉద్యమం దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రచారంలో ఈ నిరసన కూడా ఒక భాగం. ఇలాంటి నిరసనలు ఇప్పటికే ఢిల్లీ, పూణే, లక్నోలలో జరిగాయి.

  • Related Posts

    అగ్నిమాప‌క సిబ్బంది ప‌నితీరు భేష్ : అనిత వంగ‌ల‌పూడి

    అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర హోం, విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖ‌ల మంత్రి వంగ‌ల‌పూడి అనిత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో అగ్ని మాప‌క శాఖ‌లో ప‌ని చేస్తున్న సిబ్బంది, ఉద్యోగుల ప‌నితీరు అద్భుతంగా ఉందంటూ ప్ర‌శంసలు కురిపించారు. సోమ‌వారం విజయనగరం జిల్లాలో…

    జ‌గ‌న్ రెడ్డి ఆరోప‌ణ‌లు అవాస్త‌వం : డోలా శ్రీ బాల

    అమ‌రావ‌తి : మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి నిప్పులు చెరిగారు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై. ఆయ‌న చేస్తున్న ఆరోప‌ణ‌లలో వాస్త‌వం లేద‌న్నారు. సోమ‌వారం మంత్రి మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం సర్వీస్ రూల్స్ లేకుండా, నిర్దిష్ట…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *