ఏపీలో యోగాంధ్ర కార్య‌క్ర‌మాన్ని స‌క్సెస్ చేయాలి


దిశా నిర్దేశం చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఏపీలో ఈనెల 21న యోగాంధ్ర కార్య‌క్ర‌మాన్ని ఘ‌నంగా నిర్వహించాల‌ని ఆయ‌న ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించారు. యోగాంధ్ర నిర్వ‌హ‌ణ ఏర్పాట్ల‌పై సచివాల‌యంలో కీల‌క స‌మీక్ష చేప‌ట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర నిర్వహణకు తీసుకున్న చర్యలు, ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 20న ఉండవల్లి గుహల దగ్గర జరిగే యోగా కార్యక్రమంలో బాబా రాందేవ్‌తో కలిసి పాల్గొంటాన‌ని చె్ప్పారు సీఎం.

21వ తేదీన విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో స్టేట్ ఈవెంట్‌ నిర్వహణకు విస్తృతంగా ఏర్పాట్లు చేయాల‌ని సీఎస్ ను, ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించారు నారా చంద్ర‌బాబు నాయుడు. స్టేడియంలో 5 వేల నుంచి 6 వేల మందితో యోగా కార్యక్రమం ఉంటుంద‌న్నారు. బాబా రాందేవ్ సహా ప‌లువురు యోగా ప్ర‌ముఖులు హాజ‌ర‌వుతార‌ని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే యోగాంధ్రకు వచ్చే వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని స్ప‌ష్టం చేశారు. ఆరోగ్యంపై అందరూ ధ్యాస పెట్టేలా…. యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

  • Related Posts

    వ్య‌వ‌సాయ రంగానికి బ‌డ్జెట్ లో ప్రాధాన్య‌త

    చెన్నై : త‌మిళ‌నాడు స‌ర్కార్ వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తోంది. ఇందులో భాగంగా సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ అధ్యక్ష‌త‌న కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. వరి, చెరకు పంటలకు కనీస మద్దతు ధర పెంపుపై ప్రధానంగా చర్చించ‌నున్నారు. ఇవాళ జోసెఫ్…

    రైతుల‌కు రూ. 300 కోట్ల వార్షిక బ‌కాయిల చెల్లింపు

    అమ‌రావ‌తి : ఏపీ పుర‌పాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సీఎం అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన సీఆర్డీఏ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు తెలిపారు. పలు ప్రాజెక్టుల‌కు ఆమోదం తెలిపార‌న్నారు. ఆలస్యం కారణంగా గృహ కొనుగోలుదారులు అదనపు ఆర్థిక…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *