కృష్ణలంక సీఐపై విచార‌ణ‌కు ఆదేశం

ఆదేశాలు జారీ చేసిన ఏపీ డీజీపీ

విజ‌య‌వాడ : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ లు రౌడీషీట‌ర్ లాక‌ప్ డెత్ పై స్పందించారు. ఈ ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. రౌడీషీటర్ సాయికృష్ణ లాక్ అప్ డెత్ ఆరోపణల నేపథ్యంలో కృష్ణలంక సీఐ నాగరాజు సస్పెండ్ చేసింది స‌ర్కార్. ఘటనను సీరియస్ గా తీసుకున్నారు సీఎం, డిప్యూటీ సీఎం. త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డీజీపీని ఆదేశించారు. ఈరోజు డీజీపీని పిలిపించి స్వయంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు. ముందుగా నాగరాజు ను వీ ఆర్ కు బదిలీ చేసిన విజయవాడ కమిషనర్.

కానీ తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘటన సంచలనంగా మారడంతో సీరియస్ గా పరిగణించారు సీఎం. నాగరాజును సస్పెండ్ చేయాలని సీఎం సూచించడంతో సాయంత్రం అతన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు డీజీపీ గుప్తా. మరోవైపు సమగ్ర విచారణకు ఆదేశించింది ప్రభుత్వం.. నాగరాజు దోషిగా తేలితే చట్టపరంగా కేసులు పెట్టీ అరెస్ట్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

  • Related Posts

    వ్య‌వ‌సాయ రంగానికి బ‌డ్జెట్ లో ప్రాధాన్య‌త

    చెన్నై : త‌మిళ‌నాడు స‌ర్కార్ వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తోంది. ఇందులో భాగంగా సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ అధ్యక్ష‌త‌న కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. వరి, చెరకు పంటలకు కనీస మద్దతు ధర పెంపుపై ప్రధానంగా చర్చించ‌నున్నారు. ఇవాళ జోసెఫ్…

    రైతుల‌కు రూ. 300 కోట్ల వార్షిక బ‌కాయిల చెల్లింపు

    అమ‌రావ‌తి : ఏపీ పుర‌పాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సీఎం అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన సీఆర్డీఏ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు తెలిపారు. పలు ప్రాజెక్టుల‌కు ఆమోదం తెలిపార‌న్నారు. ఆలస్యం కారణంగా గృహ కొనుగోలుదారులు అదనపు ఆర్థిక…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *