డిజిటల్ క్యాబినెట్ దిశగా తెలంగాణ అడుగులు


కీలక సూచ‌న‌లు చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : తెలంగాణ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కాగిత ర‌హిత పాల‌న‌కు శ్రీ‌కారం చుట్టారు సీఎం రేవంత్ రెడ్డి. సచివాలయంలో అనధికారిక మంత్రివర్గ సమావేశం నిర్వ‌హించారు. డిజిటల్ క్యాబినెట్ దిశగా తెలంగాణ అడుగులు వేస్తోంది. పేపర్‌లెస్’ (కాగిత రహిత) పాలన వైపు మళ్లుతున్న తరుణంలో, మంత్రివర్గ సమావేశ అజెండా , పత్రాలను డిజిటల్ విధానంలో చూసుకునేందుకు వీలుగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి ప్రత్యేక టాబ్లెట్‌ను అందజేశారు. ఇందులో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ,

మంత్రులు కీలక అంశాలపై సమగ్రంగా చర్చిస్తున్నారు. రైతు భరోసా నిధుల విడుదల, ఇటీవలి రాజకీయ పరిణామాలు, మెట్రో రెండో దశ (Phase-2) అనుమతుల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చే వ్యూహాలపై ఈ సమావేశం ప్రధానంగా దృష్టి సారిస్తోంది. రాష్ట్రంలో పండిన వరి ధాన్యం మొత్తాన్ని కేంద్రమే సేకరించేలా చూడటంపై కూడా చర్చలు జరుగుతున్నాయి. కాగా, కాగిత రహిత పాలన దిశగా అడుగులు వేస్తూ, ప్రభుత్వం ‘తెలంగాణ డిజిటల్ క్యాబినెట్’ విధానానికి ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి ఈ కొత్త విధానాన్ని సమీక్షించగా, మంత్రివర్గ సమావేశ అజెండా, పత్రాలను డిజిటల్ రూపంలో వీక్షించేందుకు వీలుగా ఐటీ మంత్రి శ్రీధర్ బాబు మంత్రులకు ప్రత్యేక టాబ్లెట్‌లను పంపిణీ చేశారు.

  • Related Posts

    వ్య‌వ‌సాయ రంగానికి బ‌డ్జెట్ లో ప్రాధాన్య‌త

    చెన్నై : త‌మిళ‌నాడు స‌ర్కార్ వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తోంది. ఇందులో భాగంగా సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ అధ్యక్ష‌త‌న కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. వరి, చెరకు పంటలకు కనీస మద్దతు ధర పెంపుపై ప్రధానంగా చర్చించ‌నున్నారు. ఇవాళ జోసెఫ్…

    రైతుల‌కు రూ. 300 కోట్ల వార్షిక బ‌కాయిల చెల్లింపు

    అమ‌రావ‌తి : ఏపీ పుర‌పాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సీఎం అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన సీఆర్డీఏ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు తెలిపారు. పలు ప్రాజెక్టుల‌కు ఆమోదం తెలిపార‌న్నారు. ఆలస్యం కారణంగా గృహ కొనుగోలుదారులు అదనపు ఆర్థిక…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *