న‌టుడు అల్లు అర్జున్ కి కోర్టు స‌మ‌న్లు జారీ

పుష్ప మూవీ రిలీజ్ ఘ‌ట‌న సంద‌ర్భంగా

హైద‌రాబాద్ : ద‌ర్శ‌కుడు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తీసిన మూవీ పుష్ప చిత్రం విడుద‌ల సంద‌ర్బంగా హైద‌రాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు వ‌ద్ద ఉన్న సంధ్య థియేట‌ర్ వ‌ద్ద తీవ్ర తొక్కిస‌లాట ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో ఒక‌రు ప్రాణాలు కోల్పోగా ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. పోలీసులు కేసు న‌మోదు చేశారు. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. ఆయ‌న ఒక రోజు చంచ‌ల్ గూడ జైలులో ఉన్నారు. దీనిని పెద్ద ఎత్తున ప్ర‌చారం కూడా చేసుకున్నారు. తాజాగా బ‌న్నీకి కోలుకోలేని షాక్ త‌గిలింది.

శుక్ర‌వారం నాంప‌ల్లి కోర్టు సీరియ‌స్ అయ్యింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన కేసు విచారించింది. పుష్ప2 విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ లో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనకి సంబంధించి అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. సోమవారం విచారణకు రావాలని పేర్కొంది. ఈ ఘటనలో అల్లు అర్జున్‌ ఏ11గా ఉన్నారు. ఏ1 నుంచి ఏ10 వరకు సంధ్య థియేటర్‌ యాజమాన్యం నిందితులుగా ఉన్నారు . 2024 డిసెంబర్‌ 4న పుష్ప-2 బెనిఫిట్‌ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజకు తీవ్ర గాయాలయ్యాయి.

  • Related Posts

    ‘ఆదర్శ కుటుంబం’ నారాయ‌ణ‌మ్మ పాట అదుర్స్

    హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన న‌టుడు విక్ట‌రీ వెంక‌టేశ్. ఇక మాట‌ల మాంత్రికుడిగా, దిగ్గ‌జ ద‌ర్శ‌కుడిగా టాప్ లో కొన‌సాగుతున్నాడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్. ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌స్తున్న చిత్రం ఆద‌ర్శ కుటుంబం –…

    సోష‌ల్ మీడియా వ‌ద్దు ప్రేమ‌ను పంచండి

    చెన్నై : ప్ర‌ముఖ న‌టుడు సూర్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న ఫ్యాన్స్ కు కీల‌క సూచ‌న‌లు చేశారు. సోష‌ల్ మీడియాకు దూరంగా ఉండాల‌ని, ద్వేష పూరిత వ్యాఖ్య‌లు చేయొద్ద‌ని సూచించారు. ప్ర‌తి ఒక్క‌రికీ ప్రేమ‌ను పంచాల‌ని కోరాడు. ఘర్షణలకు దూరంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *