సాయికృష్ణ కుటుంబానికి న్యాయం చేస్తాం

త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మికి భ‌రోసా ఇచ్చిన చంద్ర‌బాబు

అమ‌రావ‌తి : ఏపీలో సంచ‌ల‌నం రేపింది విజ‌య‌వాడ కృష్ణ‌లంక సీఐ నాగ‌రాజు వ్య‌వ‌హారం. రౌడీ షీట‌ర్ సాయికృష్ణ‌ను లాక‌ప్ డెత్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఈ వ్య‌వ‌హారంలో త‌న‌ను స‌స్పెండ్ చేసింది స‌ర్కార్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేర‌కు . ఇదిలా ఉండ‌గా గాదె సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ముఖ్యమంత్రి చంద్రబాబును సీఎం క్యాంపు కార్యాలయంలో కలిశారు. తన కుమారుడి అదృశ్యం ఘటనపై విచారణ జరిపి న్యాయం చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆమెకు ధైర్యం చెప్పారు.

ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపిస్తామని హామీ ఇచ్చారు. విజయలక్ష్మితో మాట్లాడి మొత్తం ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. తన కుటుంబానికి న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంపై విజయలక్ష్మి సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత తమకు న్యాయం జరుగుతుందనే విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు. సమగ్ర విచారణ జరిపి నిందితులకు శిక్ష పడేలా చూస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారని గాదె విజయలక్ష్మి తెలిపారు.

  • Related Posts

    వ్య‌వ‌సాయ రంగానికి బ‌డ్జెట్ లో ప్రాధాన్య‌త

    చెన్నై : త‌మిళ‌నాడు స‌ర్కార్ వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తోంది. ఇందులో భాగంగా సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ అధ్యక్ష‌త‌న కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. వరి, చెరకు పంటలకు కనీస మద్దతు ధర పెంపుపై ప్రధానంగా చర్చించ‌నున్నారు. ఇవాళ జోసెఫ్…

    రైతుల‌కు రూ. 300 కోట్ల వార్షిక బ‌కాయిల చెల్లింపు

    అమ‌రావ‌తి : ఏపీ పుర‌పాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సీఎం అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన సీఆర్డీఏ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు తెలిపారు. పలు ప్రాజెక్టుల‌కు ఆమోదం తెలిపార‌న్నారు. ఆలస్యం కారణంగా గృహ కొనుగోలుదారులు అదనపు ఆర్థిక…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *