ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఖుష్బు సుందర్
గోవా : తమిళ చలన చిత్ర పరిశ్రమలో మోస్ట్ పాపులర్ నటి , భారతీయ జనతా పార్టీ కీలక నాయకురాలు ఖుష్బు, నిర్మాత సుందర్ ల కూతురు అవంతిక సుందర్ ల వివాహం గోవాలోని ఓ రిసార్ట్ లో అంగరంగ వైభవోపేతంగా జరిగింది. ఈ వేడుకకు దేశం నలుమూలల నుంచి సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార, వాణిజ్య రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. వీరంతా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. పెళ్లి వేడుకల ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్నారు ఖుష్బు సుందర్. ఈ సందర్బంగా వివాహానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం ఇవి వైరల్ గా మారాయి. పెళ్లి గురించి ఖుష్బు సుందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తల్లిదండ్రులుగా తాము ఎంతో విలువనిచ్చే విషయాలలో కుటుంబానిదే ప్రధాన స్థానం అని పేర్కొన్నారు. అలాగే వివాహాలు స్వర్గంలోనే నిర్ణయించ బడతాయని మేము ఎప్పుడూ నమ్ముతాం. కుటుంబ సభ్యులు , సన్నిహిత మిత్రుల ప్రేమ మధ్య, మా హృదయాలలో ఎప్పటికీ నిలిచిపోయే ఒక అద్భుతమైన ఘట్టాన్ని మేము చూశాము. మమ్మల్ని చుట్టుముట్టిన ఆప్యాయత, అనురాగం, శుభాకాంక్షలు ఈ సందర్భాన్ని నిజంగా మంత్ర ముగ్ధులను చేసేలా చేశాయి. మా కళ్లు ఇంకా ఆనందబాష్పాలతో నిండి ఉన్నాయి, అలాగే మా హృదయాలు సంతోషం , కృతజ్ఞతాభావంతో ఉప్పొంగుతున్నాయి.







