Friday, 16 October 2026

ఫిడెల్ క్యాస్ట్రో కోట్లాది ప్ర‌జ‌ల‌కు ‘ఎన‌లేని స్పూర్తి’

newsseals-FidelCastro

హైద‌రాబాద్ : క్యూబా విప్లవ నాయ‌కుడు, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట యోధుడు ఫిడెల్ కాస్ట్రో శత జయంతి ఇవాళ‌. ప్రపంచంలోని పురోగామి శక్తులన్నీ ఎంతో స్ఫూర్తివంతంగా నిర్వహిస్తున్నాయి ఆగ‌స్టు 13న నిర్వ‌హిస్తున్నాయి. 1926 ఆగస్టు 13న క్యూబాలోని చిన్న పట్టణంలో జన్మించాడు కాస్ట్రో. 2016 నవంబర్ 25న రాజధాని హవానాలో మరణించారు. 90 ఏళ్ల నిండు జీవితంలో కాస్ట్రో క్యూబా ప్రజలకే కాకుండా విశ్వ మానవాళికి చేసిన సేవలు, అందించిన స్ఫూర్తి అద్వితీయమైనవి. సహచరుడు చే గువేరా, సోదరుడు రావుల్ కాస్ట్రో తదితరులతో కలిసి ఆయన 1959లో క్యూబాలో విప్లవాన్ని సాధించడం ద్వారా, అమెరికా తన “పెరటి దొడ్డి”గా భావిస్తున్న లాటిన్ అమెరికా ఖండంలో విప్లవాలకు తలుపులు తెరిచాడు. కాస్ట్రో కృషి క్యూబాకు మాత్రమే పరిమితమైనది కాదు.

క్యూబా విప్లవ సాధనలోనూ, అక్కడ సోషలిజం నిర్మాణంలోనూ, అంతర్జాతీయంగా వలస విముక్తి పోరాటాలకు ప్రత్యక్ష, పరోక్ష సాయాన్ని అందించడం లోనూ, ప్రపంచంలో ఎక్కడ విపత్తులు జరిగినా అక్కడికి క్యూబా వైద్యులను, సహాయక సిబ్బందిని పంపించి ప్రజలకు సేవలు అందించడంలోనూ, లాటిన్ అమెరికా ఖండంలో సామ్రాజ్యవాద వ్యతిరేక కూటముల ఏర్పాటులోనూ కాస్ట్రో చేసిన ఎనలేని కృషి ఆయనను గొప్ప అంతర్జాతీయ నేతగా, విశ్వమానవాళి సంక్షేమాన్ని కాంక్షించే మానవతా వాదిగా నిలిపాయి. శతజయంతి సందర్భంగా ఫైడల్ కాస్ట్రో విశ్వ మానవాళికి చేసిన సేవలను స్మరించు కోవడంతోపాటు ఆయన అందించిన విప్లవ వారసత్వాన్ని, సామ్రాజ్యవాద వ్యతిరేక స్ఫూర్తిని నేటి యువతరానికి బదిలీ చేయడం అవసరం. అందునా ప్రపంచ మంతటా, మన దేశంలోనూ మితవాద శక్తుల రాజకీయ కుట్రలపై Gen Z తరం తిరుగుబాటు చేస్తున్న ఈ సమయంలో ఇది మరింత అవసరం.

గ‌మ‌నిక : ఫిడెల్ క్యాస్ట్రో స్వ‌యంగా రాసిన పుస్త‌కం ఎన‌లేని స్పూర్తి అందుబాటులో ఉంది. ఇది 144 పేజీలు ఉంటుంది. ధ‌ర కేవ‌లం రూ. 150 మాత్ర‌మే. కావాల్సిన వాళ్లు ఈ ఫోన్ నెంబ‌ర్ 9490099279 ను సంప్ర‌దిస్తే దొరుకుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *