Friday, 16 October 2026

టీవీకే డీలిమిటేష‌న్ తీర్మానం ఒప్పుకోం : అన్నాడీఎంకే

newsseals-PalaniSwami

చెన్నై : అన్నాడీఎంకే చీఫ్ ప‌ళ‌నిస్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గురువారం ఆయ‌న చెన్నైలో మీడియాతో మాట్లాడారు. డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన)పై TVK తీర్మానాన్ని అన్నాడీఎంకే పార్టీ వ్య‌తిరేకిస్తోంద‌ని చెప్పారు. మహిళలకు 33% రిజర్వేషన్‌కు AIADMK మద్దతు ఇస్తున్న‌ట్లు తెలిపారు. రాజకీయ కారణాలతోనే ప్రవేశ పెట్టారన్న ఆరోపణతో అసెంబ్లీలో ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ తీర్మానాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తోందని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి చెప్పారు. అయితే పార్లమెంటు , రాష్ట్ర శాసనసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరే తీర్మానంలోని అంశానికి మాత్రం AIADMK మద్దతు ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.

డీలిమిటేషన్‌పై AIADMK వైఖరి స్పష్టంగా ఉందని అన్నారు. జనాభా పెరుగుదలను విజయవంతంగా నియంత్రించిన రాష్ట్రంగా తమిళనాడుకు పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గకూడదని ప‌ళ‌ని స్వామి అన్నారు.తమిళనాడుకు ఉన్న 7.18 శాతం వాటాను అలాగే కొనసాగిస్తే, రాష్ట్రానికి అదనంగా సుమారు 20 లోక్‌సభ స్థానాలు లభించి, మొత్తం స్థానాల సంఖ్య 59కి చేరుతుంది అని ఆయన చెప్పారు. తమిళనాడుకు ప్రస్తుతం ఉన్న ప్రాతినిధ్యం తగ్గకూడదని, దానికి బదులుగా 50 శాతం పెంచాలన్నదే AIADMK వైఖరి అని ఆయన తెలిపారు. రాజకీయ కారణాలతో ప్రవేశ పెట్టిన TVK తీర్మానాన్ని AIADMK వ్యతిరేకిస్తోందని పేర్కొన్నారు. పార్లమెంటు , రాష్ట్ర శాసనసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్‌కు మాత్రమే తాము మద్దతు ఇస్తున్నామని పళనిస్వామి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *