న‌ల్గొండ‌ను రాష్ట్రానికి రోల్ మోడ‌ల్ చేస్తాం

మంత్రి కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి ప్ర‌క‌ట‌న

న‌ల్ల‌గొండ జిల్లా : రాబోయే రోజుల్లో న‌ల్ల‌గొండ‌ను అన్ని రంగాల‌లో అభివృద్ది చేస్తామ‌న్నారు మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి. రూ.13,006 కోట్లతో 6,092.37 కిలోమీటర్ల మేర 441 హ్యామ్ (HAM) రోడ్లకు శ్రీకారం చుట్టడం రాష్ట్ర రవాణా రంగంలో నూతన అధ్యాయానికి నాంది ప‌లికిన‌ట్ల‌యింద‌న్నారు. ఈ రోడ్లు కేవలం ప్రయాణ మార్గాలు మాత్రమే కాదు, మన పల్లెలను ప్రగతి వైపు నడిపించి, మన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే అభివృద్ధి బాటలు. ప్రతి గ్రామాన్ని జిల్లా కేంద్రంతో అనుసంధానం చేసి తెలంగాణను మరింత బలమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే మా ప్రభుత్వ సంకల్పం అన్నారు మంత్రి.

ఒక కుటుంబ పెద్దలా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం వంటి సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో భరోసా నింపుతూనే, మరోవైపు మౌలిక సదుపాయాల అభివృద్ధితో తెలంగాణను ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తున్నాం. నల్గొండ బిడ్డగా నా గుండెను తొలిచే బాధ ఫ్లోరైడ్ సమస్య. దానికి శాశ్వత పరిష్కారం చూపే మన చిరకాల స్వప్నమైన ఎస్.ఎల్.బి.సి (SLBC) ప్రాజెక్టును వేగవంతం చేశాం. 2028 ఆగస్టు నాటికి సొరంగం ద్వారా నాలుగు లక్షల ఎకరాలకు కృష్ణా జలాలు అందించి ఆ లక్ష్యాన్ని సాకారం చేస్తాం అన్నారు.

  • Related Posts

    రేవంత్ రెడ్డి రాజకీయ సమాధికి పునాది వేస్తాం : మ‌ల్ల‌న్న‌

    వికారాబాద్ జిల్లా : ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు సీఎం రేవంత్ రెడ్డిపై. సీఎం ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కోడంగల్ నియోజ‌క‌వ‌ర్గంలోని కోస్గిలో పాద‌యాత్ర సంద‌ర్బంగా ప్ర‌సంగించారు. తెలంగాణ రాష్ట్రానికి త‌ను చివ‌రి ముఖ్య‌మంత్రి కావ‌డం ఖాయ‌మ‌న్నారు. బీసీలకు రాజ్యాధికారం…

    ఆరోగ్యంపై చైతన్యం పెరగాలి : సీతక్క

    హైద‌రాబాద్ : సంపాదించ‌డం కంటే ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి సారించాల‌ని అన్నారు మంత్రి సీత‌క్క‌. హైద‌రాబాద్ లో నిర్వ‌హించిన పింక్ ర‌న్ ను ఉద్దేశించి ఆమె ప్ర‌సంగించారు. ఆరోగ్య పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగ పడతాయని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *