పాల‌నా ప‌రంగా మ‌రింత పార‌ద‌ర్శ‌క‌త : సంజ‌య్ జాజు

Spread the loveప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా బాధ్య‌త‌లు స్వీక‌ర‌ణ హైద‌రాబాద్ : రాష్ట్రంలో పాల‌నా ప‌రంగా మ‌రింత పార‌ద‌ర్శ‌క‌త ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు నూత‌న సీఎస్ సంజ‌య్ జాజు. రాష్ట్ర స‌చివాల‌యంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేప‌ట్టారు. 1992 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన సంజయ్ జాజు, ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తించి పదవీ విరమణ చేసిన కె. రామకృష్ణ రావు (IAS) స్థానంలో బాధ్యతలు చేపట్టారు. సంజయ్ జాజును…

newsseals-Sanjayjaju
Spread the love

ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా బాధ్య‌త‌లు స్వీక‌ర‌ణ

హైద‌రాబాద్ : రాష్ట్రంలో పాల‌నా ప‌రంగా మ‌రింత పార‌ద‌ర్శ‌క‌త ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు నూత‌న సీఎస్ సంజ‌య్ జాజు. రాష్ట్ర స‌చివాల‌యంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేప‌ట్టారు. 1992 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన సంజయ్ జాజు, ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తించి పదవీ విరమణ చేసిన కె. రామకృష్ణ రావు (IAS) స్థానంలో బాధ్యతలు చేపట్టారు. సంజయ్ జాజును కొత్త ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం జూన్ 26న ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ సందర్భంగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, ప్రభుత్వ కార్యదర్శులు, శాఖాధిపతులు, సచివాలయ అధికారులు , సిబ్బంది సంజయ్ జాజుకు అభినందనలు తెలిపారు. అలాగే, కె. రామకృష్ణ రావుకు పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా వీడ్కోలు పలికారు. ఇదిలా ఉండ‌గా పాల‌నా ప‌రంగా అపార‌మైన అనుభ‌వం ఉంది. ఆయ‌న గ‌తంలో ఏపీలో కీల‌క‌మైన ప‌ద‌వులు చేప‌ట్టారు. అంతే కాదు దేశ వ్యాప్తంగా ఆయ‌న సంచ‌ల‌నంగా మారారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం త‌ను రూపొందించిన మీ సేవ కార్య‌క్రం.

దీని ద్వారా ప్ర‌భుత్వానికి చెందిన 350కి పైగా స‌ర్వీసుల‌న్నీ ఒకే దాంట్లో న‌మోదు చేసుకునే వీలు క‌లిగింది. దీని వ‌ల్ల పాల‌నా ప‌రంగా ఒత్తిడి త‌గ్గ‌డంతో పాటు సిబ్బంది శ్ర‌మ లేకుండా పోయింది. సంజయ్ జాజు ఏపీ నుండి కేంద్రానికి వెళ్లారు. అక్క‌డ టెక్నాల‌జీ ప‌రంగా కీల‌క‌మైన పాత్ర పోషించారు. త‌న‌ను ఏరికోరి సీఎం రేవంత్ రెడ్డి సీఎస్ గా తీసుకు వ‌చ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports