ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు ఖుష్ కబర్ చెప్పింది. ప్రతిరోజు వేలాది మంది నిత్యం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ప్రయాణం చేస్తుంటారు. ఇవాళ కీలక ప్రకటన చేసింది సంస్థ. ఇదిలా ఉండగా బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చే అన్ని సర్వీసుల ప్రయాణికుల కోసం నగరంలోని ప్రధాన మార్గాల్లో కింది విధంగా స్టాప్‌లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.
పటాన్చెరు రూట్ లో పటాన్చెరు నుండి ఎంజీబీఎస్ (MGBS), ఆరాంఘర్, శంషాబాద్ వరకు ఉన్న అన్ని ప్రధాన స్టేజీలలో దిగే పాయింట్లను ఏర్పాటు చేసింది టీఎస్ఆర్టీసీ. ఇక జేబీఎస్ రూట్ లో జేబీఎస్ (JBS) నుండి ఎంజీబీఎస్, ఆరాంఘర్, శంషాబాద్ వరకు ఉన్న అన్ని ప్రధాన స్టేజీలలో నిలుపుతారు. హయత్ నగర్ రూట్ లో హయత్ నగర్ నుండి ఎంజీబీఎస్, ఆరాంఘర్, శంషాబాద్ వరకు ఉన్న అన్ని ప్రధాన స్టేజీలలో బోర్డింగ్/అలైటింగ్ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపింది .
టీజీఎస్ ఆర్టీసీ కల్పించిన ఈ అద్భుతమైన సదవకాశాన్ని బెంగళూరు – హైదరాబాద్ మధ్య ప్రయాణించే ప్రయాణికులందరూ వినియోగించు కోవాలని సంస్థ కోరింది. ఇదిలా ఉండగా మీ ఇంటికి దగ్గరలోనే బోర్డింగ్ పాయింట్లను ఎంచుకుని, సురక్షితమైన, సుఖవంతమైన ప్రయాణాన్ని ఆస్వాదించాలని యాజమాన్యం సూచించింది. అంతే కాకుండా ముందస్తు బుకింగ్స్ , ఇతర వివరాల కోసం ప్రయాణికులు తమ టికెట్లను బుక్ చేసుకోవడానికి టీజీఎస్ ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ www.tgsrtcbus.in ను సందర్శించాలని కోరింది.















