వ‌చ్చే ఐపీఎల్ సీజ‌న్ లో ఎంఎస్ ధోనీ ఆడ‌టం క‌ష్ట‌మే

చెన్నై : భార‌త దేశ క్రికెట్ రంగంలో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన ఏకైక క్రికెట‌ర్ జార్ఖండ్ డైన‌మెట్ మ‌హేంద్ర సింగ్ ధోనీ. త‌న సార‌థ్యంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ ప‌లుమార్లు ఐపీఎల్ టైటిళ్ల‌ను స్వంతం చేసుకుంది. ప‌లువురిని మార్చింది సీఎస్కే యాజ‌మాన్యం. కానీ వ‌ర్క‌వుట్ కాలేదు. రుతురాజ్ గైక్వాడ్ ను ప్ర‌స్తుతానికి కెప్టెన్ గా కొన‌సాగిస్తున్నా భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసిన సంజు శాంస‌న్ పైనే ఎక్కువ‌గా ఆశలు పెట్టుకుంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం ధోనీ లాగానే త‌ను కూడా వికెట్ కీప‌ర్, కెప్టెన్ . అంతే కాకుండా మిస్ట‌ర్ కూల్ గా పేరు పొందాడు శాంస‌న్. దీంతో ఎంఎస్ కూడా త‌న వైపే ఎక్కువ‌గా మొగ్గు చూపుతున్నాడు.

తాజాగా వ‌చ్చే 2027లో జ‌రిగే ఐపీఎల్ సీజ‌న్ లో ధోనీ ఆడ‌క పోవ‌చ్చ‌ని క్రికెట్ వ‌ర్గాల ద్వారా విశ్వ‌స‌నీయ స‌మాచారం. తన భవిష్యత్తు గురించి చెన్నై సూపర్ కింగ్స్ (CSK) యాజమాన్యం MS ధోనీతో సుదీర్ఘ చర్చలు జరిపినట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ త‌రుణంలో ఈ దిగ్గజ కెప్టెన్ మరో సీజన్ ఆడాలని ఫ్రాంచైజీ ఆశిస్తున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే IPL 2027లో ధోనీ ఆటగాడిగా తిరిగి రావడం అసంభవంగా కనిపిస్తోంది. అయితే, ధోనీ వేరే ఏదైనా పాత్రలో జట్టుతో కొనసాగుతారని ఆశిస్తూనే, ఒక కొత్త శకంలోకి అడుగు పెట్టేందుకు CSK సన్నద్ధమవుతోంది.

  • Related Posts

    ఇంగ్లాండ్‌లో భారత్ పేలవ ప్రదర్శనపై హర్ష భోగ్లే ఆగ్రహం

    ఇంగ్లండ్ : ప్ర‌ముఖ కామెంటేట‌ర్ హ‌ర్ష భోగ్లే ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్రపంచంలోనే నంబర్ వన్ ర్యాంక్‌లో ఉన్న భారత జట్టు ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ జట్టు నిర్దేశించిన 201 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేవలం…

    హ్యాపీ బ‌ర్త్ డే మిస్ట‌ర్ కూల్ ధోనీ : విజ‌య్

    చెన్నై : ఇవాళ భార‌త క్రికెట్ రంగంలో త‌న‌దైన ముద్ర వేసిన జార్ఖండ్ డైన‌మెట్, మాజీ కెప్టెన్ , చెన్నై సూప‌ర్ కింగ్స్ స్టార్ క్రికెట‌ర్ మ‌హేంద్ర సింగ్ ధోనీ పుట్టిన రోజు. జూలై 6న ఆయ‌న పుట్టారు. ఈ సంద‌ర్బంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *