జ‌ల‌హార‌తి కార్య‌క్రమంలో పాల్గొన్న సీఎం

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు బుధ‌వారం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని కృష్ణా-గోదావరి జలాల పవిత్ర సంగమం వద్ద జరిగిన జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. కృష్ణవేణి-గోదావరి నదుల సంగమ ప్రదేశంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పూలమాలలు, వస్త్రాలు, పసుపు, కుంకుమలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, మాజీ మంత్రి శ్రీ దేవినేని ఉమా మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

జ‌ల‌హార‌తి కార్య‌క్ర‌మంలో పాల్గొన్న అనంత‌రం ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కొలువు తీరిన కూట‌మి స‌ర్కార్ నీటి పారుద‌ల రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తోంద‌ని చెప్పారు. భారీ ఎత్తున నిధుల‌ను మంజూరు చేశామ‌న్నారు. పాడై పోయిన కాట‌న్ బ్యారేజ్ గేట్ల‌ను పున‌రుద్ద‌రించేందుకు రూ. 110 కోట్లు విడుద‌ల చేశామ‌న్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టును త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని సీఎం చెప్పారు. గ‌తంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ నీటి పారుద‌ల రంగాన్ని ప‌ట్టించు కోలేద‌ని ఆరోపించారు. కానీ తాము వ‌చ్చాక జీవం పోస్తున్నామ‌న్నారు.

  • Related Posts

    ప్రధాని మోదీతో ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియన్ భేటీ

    టెహ్రాన్ : ఇరాన్ అధ్యక్షుడు ప్రధాని మోదీ, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ , కిర్గిజ్‌స్థాన్, రష్యా, తజికిస్థాన్ అధ్యక్షులతో సహా పలువురు పాల్గొనే నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. కిర్గిజ్‌స్థాన్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్…

    వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం చారిత్రాత్మక ఘట్టం

    అమరావ‌తి : వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం చారిత్రాత్మక ఘట్టం అని పేర్కొన్నారు మంత్రి మండిప‌ల్లి రాంప్ర‌సాద్ రెడ్డి. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో వెలిగొండను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశార‌న్నారు. ఈ సంద‌ర్బంగా సీఎంకు ధ‌న్య‌వాదాలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *