
1985లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అమలులోకి వచ్చింది. దీనిని 52వ సవరణ చట్టంలో పొందుపరిచి, భారత రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్‌లో చేర్చారు. పార్టీ సభ్యులు తమ పార్టీ సూత్రాలకు కట్టుబడి ఉండేలా చూసుకోవడం దీని లక్ష్యం.పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంగా విస్తృతంగా గుర్తింపు పొందింది ఈ చట్టం. దీనిని ఉల్లంఘిస్తే ఎమ్మెల్యే లేదా ఎంపీ సభ సభ్యత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. పార్టీ సిద్ధాంతాలను కాపాడేందుకు , ఎన్నికైన ప్రతినిధులలో క్రమశిక్షణను పెంపొందించడానికి, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు ఇది మూల స్తంభంగా నిలుస్తుంది.
ఆయా రామ్ గయా రామ్ అనేది దేశ వ్యాప్తంగా పాపులర్ గా మారింది. దీనికి అంకురార్పణ జరిగింది 1967లో. హర్యానాలో ఎమ్మెల్యే గయా లాల్ ఒకే రోజులో మూడుసార్లు పార్టీ మారారు. ఈ ఫిరాయింపులు సుస్థిర ప్రభుత్వానికి ఆటంకంగా మారాయి. ఒక రకంగా బ్లాక్ మెయిల్ రాజకీయాలకు ఆజ్యం పోశాయి. ఈ తరుణంలో బలమైన డెమోక్రసీకి ఈ చట్టం దోహదకారిగా ఉండేందుకు ఏర్పాటు చేశారు. అంతే కాదు సురక్షితమైన రాజకీయ వాతావరణాన్ని నెలకొల్పేందుకు చట్టం తీసుకు వచ్చేందుకు ఆనాటి దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ చొరవ చూపారు. 1984 నుండి 1989 వరకు ప్రధానిగా ఉన్న ఆయన పార్టీ ఫిరాయింపుల వల్ల ఎదురయ్యే సవాళ్లను, సమస్యల నుంచి రక్షించేందుకు ఇది అవసరమని భావించారు. బిల్లును ప్రతిపాదించారు చట్ట సభలో.
1985లో 52వ సవరణ చట్టం ద్వారా లభించచింది. భారత రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ ను ప్రవేశ పెట్టింది. ఫిరాయింపుల నిరోధక చట్టంగా మారింది. సభ్యులు ఫిరాయింపులకు పాల్పడితే అరికట్టేందుకు వీలు కలుగుతుంది. ఇదే సమయంలో 2003లో 91వ సవరణ చట్టం వచ్చింది. ఈ చట్టంలో కొన్ని మార్పులు చేయబడ్డాయి. ఆయా పార్టీల సభ్యులపై అనర్హత వేటు పడుతుంది. పార్టీ సభ్యత్వాన్ని స్వచ్చంధంగా కోల్పోతాడు. ఇండిపెండెట్ గా గెలిచిన సభ్యుడు రాజకీయ పార్టీలో చేరితే అర్హత కోల్పోతాడు. ఫిరాయింపులకు సంబంధించి అనర్హత వేటు వేసే అధికారం కేవలం స్పీకర్, సభా చైర్మన్ పై ఉంటుంది. ఇదే సమయంలో ఒక రాజకీయ పార్టీకి చెందిన ఎన్నికైన సభ్యులలో మూడింట రెండొంతుల మంది మరొక పార్టీలో విలీనం కావాలని నిర్ణయించుకుంటే, కొత్త పార్టీలో చేరిన వారు లేదా అసలు పార్టీలో ఉన్నవారు అనర్హతకు గురికారు. అయితే నామినేటెడ్ సభ్యులకు ఈ అనర్హత వేటు వర్తించదు.