కవిత ఎపిసోడ్ ఓ పెద్ద కుటుంబ‌ డ్రామా

తాజాగా ఎమ్మెల్సీ క‌విత చేసిన కామెంట్స్ పై తీవ్రంగా స్పందించారు మంత్రి సీత‌క్క‌. తెలంగాణ జాతిపితగా చెప్పుకునే కేసీఆర్..తన కుటుంబ సమస్యను పరిష్కరించుకోలేని బలహీన పరిస్థితుల్లో ఉన్నాడా అని ప్ర‌శ్నించారు. బుధ‌వారం సీత‌క్క మీడియాతో మాట్లాడారు. నలుగురు కుటుంబ సభ్యులను కూర్చోబెట్టి మాట్లాడి సర్దుబాటు చేయలేడా అని ఎద్దేవా చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ కుటుంబం అవినీతి బయట పడేసరికి ఈ గొడవలను తెరమీదకు తీసుకు వ‌చ్చారంటూ మండిప‌డ్డారు. అవినీతి సొమ్ము, అక్రమ సంపాదన పంపకాల్లో వచ్చిన తేడాలతోనే కేసీఆర్ కుటుంబ సభ్యులు గొడవలు పడుతున్నార‌ని అన్నారు. సంతోష్ రావు బినామీగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రూ. పందల కోట్లు సంపాదించారని కవిత ఆరోపించిందన్నారు.

దీనిపై విచార‌ణ‌కు ఆదేశించాల‌ని తాను కోరుతాన‌ని అన్నారు. ఇప్ప‌టికైనా తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఎవ‌రు మోస‌గాళ్లో పూర్తిగా తెలిసి పోయింద‌న్నారు. ములుగులో త‌న‌ను ఓడించేందుకు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వందల కోట్లు ఖర్చు చేశాడని ఆరోపించారు సీత‌క్క‌. కేటీఆర్ ప్రోత్సాహం లేనిది కవితను సస్పెండ్ చేయడం సాధ్యమా అన్న అనుమానం వ్య‌క్తం చేశారు. కేటీఆర్ ను కవిత వెనకేసుకు రావడం పెద్ద డ్రామా అని కొట్టి పారేశారు. మొదట కేటీఆర్ ను టార్గెట్ చేసి ఇప్పుడు హరీష్ రావు, సంతోష్ రావులను టార్గెట్ చేశారని పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబం అంతా ఒకటేన‌ని, భవిష్యత్తులో అందరూ కలిసి పోతార‌ని వీరంతా డ్రామా ఆర్టిస్టుల కంటే ఆరి తేరి పోయార‌ని ఫైర్ అయ్యారు. కవితను విమర్శించిన మహిళా నేతలే నష్ట పోతార‌న్నారు.

  • Related Posts

    కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల పాల‌న బ‌క్వాస్

    మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు ఫైర్ హైద‌రాబాద్ : దేశంలో బీజేపీ , రాష్ట్రంలో కాంగ్రెస్ స‌ర్కార్ పాల‌న గాడి త‌ప్పింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. జూబ్లీ హిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలో ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్…

    ప్రాణాలు పోతున్నా ప‌ట్టించుకోక పోతే ఎలా..?

    ఏపీ స‌ర్కార్ పై భ‌గ్గుమ‌న్న మాజీ సీఎం జ‌గ‌న్ అమ‌రావ‌తి : పిల్ల‌ల ప్రాణాలు పోతున్నా ప‌ట్టించుకోక పోవ‌డం దారుణ‌మ‌ని పేర్కొన్నారు మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఏపీ స‌ర్కార్ పాల‌న‌ను గాలికి వ‌దిలి వేసింద‌న్నారు. పేదల తలరాతను…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *