ఖైర‌తాబాద్ గణేశుడిని ద‌ర్శించుకున్న సీఎం

టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్, మేయ‌ర్

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో వినాయ‌కుల విగ్ర‌హాల నిమ‌జ్జ‌నం కొన‌సాగుతూనే ఉంది. భారీ ఎత్తున గ‌ణేశుల‌ను ప్ర‌తిష్టించారు. తెలంగాణ స‌ర్కార్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేర‌కు ఆయా వినాయ‌క మండ‌పాల‌కు నిమ‌జ్జ‌నం చేసేంత వ‌ర‌కు ఉచితంగా విద్యుత్ స‌ర‌ఫ‌రా చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా అతి పెద్ద గ‌ణ‌నాథుడిని ప్ర‌తిష్టించారు ఖైర‌తాబాద్ లో. ఇది గ‌త కొన్నేళ్లుగా కొన‌సాగుతూనే వ‌స్తోంది. ఈసారి కూడా భారీ విగ్ర‌హాన్ని ఇక్క‌డ ప్ర‌తిష్టించారు. దీనిని భారీ క్రేన్ల సాయంతో ఈనెల 6న శ‌నివారం నిమ‌జ్జ‌నం చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

ఈ మేర‌కు ఖైర‌తాబాద్ గ‌ణేష్ ఉత్స‌వ క‌మిటీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ సీవీ ఆనంద్ ఆదేశాల మేర‌కు భారీ ఎత్తున పోలీసు బందోబ‌స్తు చేశారు. ఇదిలా ఉండ‌గా శుక్ర‌వారం ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డితో పాటు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్ , టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్, న‌గ‌ర మేయ‌ర్ గ‌ద్వాల విజ‌యల‌క్ష్మితో పాటు ప‌లువురు మంత్రులు, ప్ర‌ముఖులు గ‌ణ‌నాథుడిని ద‌ర్శించుకున్నారు. పూజ‌లు చేశారు. గ‌ణేశ్ ఉత్స‌వ క‌మిటీ ఆధ్వ‌ర్యంలో వారికి ఘ‌నంగా స‌న్మానం చేశారు. అంత‌కు ముందు పూజారులు ఆశీర్వ‌చ‌నం చేశారు. బడా గణేష్ “శ్రీ విశ్వ శాంతి మహా గణపతి” పూజలో పాల్గొన్న సీఎంకు ధ‌న్య‌వాదాలు తెలిపారు గ‌ణేశ్ ఉత్స‌వ క‌మిటీ.

  • Related Posts

    శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో విశేష ఉత్స‌వాలు

    వెల్ల‌డించిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. తిరుమ‌ల ఆల‌య ప‌రిధిలోని ఆల‌యాల‌లో అక్టోబ‌ర్ నెల‌లో నిర్వ‌హించే ఉత్స‌వాల వివ‌రాల‌ను వెల్ల‌డించింది. ఇందులో భాగంగా అక్టోబర్…

    అంగ‌రంగ వైభ‌వంగా ప‌విత్రోత్స‌వాలు

    శ్రీ‌ప‌ట్టాభిరామ స్వామివారి ఆల‌యంలో తిరుపతి : అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామ స్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *