ట్రంప్ టారిఫ్స్ డోంట్ కేర్ : నిర్మ‌లా సీతారామ‌న్

అమెరికా దేశాధ్య‌క్షుడిపై ఆర్థిక మంత్రి కామెంట్స్

ఢిల్లీ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ షాకింగ్ కామెంట్స్ చేశారు. శ‌నివారం ఆమె మీడియాతో మాట్లాడారు. అమెరికా చీఫ్ ట్రంప్ విధించిన సుంకాల‌పై స్పందించారు. అంత‌గా ప‌ట్టించు కోవాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. దాని పై ఆలోచించ‌డం లేద‌న్నారు. త‌మ నాయ‌కుడు , ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ అద్భుత‌మైన నాయ‌కుడ‌ని, ఏ స‌మ‌యంలో ఎలా వ్య‌వ‌హ‌రించాలో , ఎక్క‌డ నొక్కాలో, ఎలాంటి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోవాలో బాగా తెలుసు అన్నారు నిర్మ‌లా సీతారామ‌న్. అనూహ్యంగా ట్రంప్ టారిఫ్స్ తో బెదిరింపుల‌కు దిగ‌డం ప‌ట్ల అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. భార‌త దేశం ఎవ‌రితో కావాల‌ని క‌య్యానికి కాలు దువ్వ‌ద‌న్నారు. కానీ అమెరికా ప‌దే ప‌దే కావాల‌ని గెలుకు తోందంటూ మండిప‌డ్డారు.

ప్ర‌స్తుతం చైనా భార‌త్ పై విధించిన ఆంక్ష‌ల‌ను తొల‌గించింద‌ని చెప్పారు. టారిఫ్స్ గురించి ప‌దే ప‌దే ఆలోచించ‌డం వ‌ల్ల ఎలాంటి ఫాయిదా ఉండ‌ద‌న్నారు నిర్మ‌లా సీతారామ‌న్. ప్రధాని మోడీ ఏ పరిస్థితిని అయినా నిర్వహించగల చతురత, పరిణతి, దౌత్యపరమైన విధానం భారతదేశానికి విశ్వాసాన్ని ఇస్తుంద‌న్నారు. మనం అల్లకల్లోల నీటిలో పడవలో ఉండవచ్చు, కానీ దాని నుండి బయట పడటానికి దారితీసే నాయకుడు మనకు ఉన్నాడ‌ని ప్ర‌శంసించారు. భార‌త దేశం ప్ర‌థ‌మ ప్రాధాన్య‌త ఇండియా త‌ప్పా మ‌రోటి కాద‌న్నారు నిర్మ‌లా సీతారామ‌న్. దేశానికి మొదటి స్థానం ఇచ్చే నాయకుడు ఉన్నంత వరకు, సమస్యలను పరిణతితో , ప్రజల శ్రేయస్సు పట్ల బాధ్యతతో నిర్వహిస్తామని ఆమె నొక్కి చెప్పారు.

  • Related Posts

    సీఎంను క‌లిసిన అన‌లాగ్ ఏఐ సీఈవో

    తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ కు ఆహ్వానం హైద‌రాబాద్ : ప్ర‌ముఖ ఐటీ దిగ్గ‌జ కంపెనీ అన‌లాగ్ ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ (సీఈఓ) అలెక్స్ కిప్ మాన్ హైద‌రాబాద్ లో మ‌ర్యాద పూర్వ‌కంగా గురువారం సీఎం ఎ. రేవంత్ రెడ్డిని…

    కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్దం

    విచార‌ణ‌కు గ‌వ‌ర్న‌ర్ అనుమ‌తి హైద‌రాబాద్ : రాష్ట్రంలో రాజ‌కీయాలు మ‌రింత వేడిని రాజేస్తున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచుతోంది. ఇప్ప‌టికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించింది. ఇదే ఊపును స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో చూపించాల‌ని అనుకుంటోంది. ప్ర‌ధాన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *