
ఆదివారం రాత్రి 7 గంటలకు గ్రాండ్ లాంచ్
హైదరాబాద్ : అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న టాప్ ప్రోగ్రాం బిగ్ బాస్ సీజన్ 9 బుల్లి తెరపై సందడి చేసేందుకు రెడీ అయ్యింది. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి 7 గంటలకు గ్రాండ్ గా లాంచ్ కానుంది. ఈ విషయాన్ని నిర్వాహకులు వెల్లడించారు అధికారికంగా. ఈ మేరకు జియో స్టార్ ఎక్స్ వేదికగా పంచుకుంది. వంద శాతం వినోదం పంచేందుకు సిద్దంగా ఉందని. ఇక వేచి ఉండడమే తరువాయి అని పేర్కొంది. గతంలో జరిగిన బిగ్ బాస్ సీజన్ లలో కీలకమైన వ్యక్తులు స్టార్లుగా, ప్రముఖులుగా పేరు పొందారు. మరికొందరు సినిమాలలో ఛాన్స్ లు కూడా దక్కించుకున్నారు. దీంతో బిగ్ బాస్ షో కు మరింత పేరు తీసుకు వచ్చేలా చేస్తోంది. ఇందులో ఆస్కార్ అవార్డు గ్రహీత రాహుల్ సిప్లిగంజ్ కూడా ఉన్నారు.
స్టార్ మాలో ప్రీమియర్‌గా డిస్నీ + హాట్‌స్టార్‌లో నిరంతరాయంగా 24/7 ప్రత్యక్ష ప్రసారంతో ప్రారంభమవుతుంది. నాగార్జున అక్కినేని మరోసారి హోస్ట్ చేస్తున్న ఈ కొత్త సీజన్ రణ రంగం అనే పేరుతో ముందుకు వస్తోంది. ఇంతకు ముందు ఎన్నడూ చూడని డబుల్-హౌస్ ఫార్మాట్‌తో హై-వోల్టేజ్ డ్రామా ఉండ బోతోందని వెల్లడించింది జియో హాట్ స్టార్. వినోద ప్రపంచం నుండి అనేక మంది సుపరిచిత ముఖాలు కూడా అడుగుపె డుతున్నందున గ్లామర్ కూడా దీనికి ప్లస్ కానుంది. ఈసారి జరిగే బిగ్ బాస్ 9 సీజన్ లో సంజన గల్రానీ, రీతు చౌదరి, తనూజ గౌడ, ఆశా సైని, శ్రష్టి వర్మ, భవానీ శంకర్, సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయేల్, రాము రాథోడ్, అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య, సింగర్ శ్రీతేజ, దువ్వాడ మాధురి పాలు పంచుకోనున్నారు.