ఇదే అత్యుత్త‌మ‌మైన ప‌న్ను విధానం : నిర్మ‌లా

ప్ర‌ధాన‌మంత్రి మోదీ విజ‌న్ ఉన్న నాయ‌కుడు

ఢిల్లీ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధాని మోదీ అత్యుత్త‌మ‌మైన విజ‌న్ క‌లిగిన నాయ‌కుడ‌ని, ఆయ‌న ఉన్నంత వ‌ర‌కు ఎలాంటి ఢోకా ఉండ‌బోదంటూ పేర్కొన్నారు. ఇప్ప‌టికే తాము జీఎస్టీ కౌన్సిల్ లో తీసుకున్న నిర్ణ‌యం, సంస్క‌ర‌ణ‌ల కార‌ణంగా పెద్ద ఎత్తున మార్కెట్ ప‌రంగా బ‌లోపేతం కావ‌డానికి దోహ‌దం చేసింద‌న్నారు. ఆదివారం నిర్మ‌లా సీతారామ‌న్ మీడియాతో మాట్లాడారు. గ‌తంలో నాలుగు స్లాబ్ లు ఉండేవ‌ని, ఇవి ప్ర‌జ‌ల‌పై పెను భారంగా మారాయ‌న్న ఆరోప‌ణ‌లు వ‌చ్చాయ‌న్నారు. కానీ ప్ర‌ధాని ప్ర‌జ‌ల మ‌నిషి అని, ఆయ‌న చేసిన సూచ‌న‌ల మేర‌కు తాను కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపారు ఆర్థిక శాఖ మంత్రి. ప్ర‌స్తుతం రెండు స్లాబ్ రేట్ల‌ను మాత్ర‌మే ఖ‌రారు చేశామ‌న్నారు. ఒక‌టి 5 శాతంగా మ‌రోటి 18 శాతంగా నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు నిర్మ‌లా సీతారామ‌న్.

అయితే దీనిని ఆర్థిక మంత్రి దీనిని ప్రజల సంస్కరణగా అభివర్ణించారు .ప్రధానమంత్రి మోడీ ప్రోత్సాహంతో జీఎస్టీని పూర్తిగా పునర్వ్యవస్థీకరించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు, పన్ను విధానాన్ని సరళీకృతం చేయడానికి, రేట్లను తగ్గించడానికి, వ్యాపారాలకు సమ్మతిని సులభతరం చేయడానికి 12 శాతం, 28 శాతం స్లాబ్ ల‌ను ర‌ద్దు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను సిద్ధం చేస్తున్నప్పుడు ప్రధానమంత్రి మరోసారి గుర్తు చేశారని తెలిపారు . పరోక్ష పన్ను విధానాన్ని సరిదిద్దడం నుండి బ్యాకెండ్ సాఫ్ట్‌వేర్ భవిష్యత్తులో భారీ మార్పును అమలు చేయడానికి సిద్ధంగా ఉందని నిర్ధారించడం వరకు జీఎస్టీ కౌన్సిల్ లో చ‌ర్చించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు నిర్మ‌లా సీతారామ‌న్.

  • Related Posts

    సీఎంను క‌లిసిన అన‌లాగ్ ఏఐ సీఈవో

    తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ కు ఆహ్వానం హైద‌రాబాద్ : ప్ర‌ముఖ ఐటీ దిగ్గ‌జ కంపెనీ అన‌లాగ్ ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ (సీఈఓ) అలెక్స్ కిప్ మాన్ హైద‌రాబాద్ లో మ‌ర్యాద పూర్వ‌కంగా గురువారం సీఎం ఎ. రేవంత్ రెడ్డిని…

    కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్దం

    విచార‌ణ‌కు గ‌వ‌ర్న‌ర్ అనుమ‌తి హైద‌రాబాద్ : రాష్ట్రంలో రాజ‌కీయాలు మ‌రింత వేడిని రాజేస్తున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచుతోంది. ఇప్ప‌టికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించింది. ఇదే ఊపును స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో చూపించాల‌ని అనుకుంటోంది. ప్ర‌ధాన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *