గ్రామాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం

అంద‌జేస్తామ‌న్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్

అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలోని గ్రామాల స‌ర్వతోముఖాభివృద్దికి సంపూర్ణ స‌హ‌కారం అంద‌జేస్తామ‌ని అన్నారు. ఈ సంద‌ర్బంగా అన్ని ర‌కాలుగా స‌హాయ స‌హ‌కారాలు అందిస్తున్న సీఎం చంద్ర‌బాబుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. రాష్ట్రంలో ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తామ‌న్నారు .పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు సంపూర్ణ సహకారం అందించి నిధులు కేటాయిస్తున్న సీఎంకు స్పెష‌ల్ గా థ్యాంక్స్ చెప్పారు డిప్యూటీ సీఎం. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా – గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలనే సంకల్పానికి బలమిస్తూ తగిన నిధులు మంజూరు చేయ‌డం ఆనందంగా ఉంద‌న్నారు.

త‌న‌తో జ‌రిగిన సుదీర్ఘ సమావేశంలో జల్ జీవన్ మిషన్ ప్రాజెక్ట్ పనులు, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు నిర్మాణం మరింత వేగవంతానికి విలువైన సూచనలు అందించారు. సీఎం సూచనలు అనుసరిస్తూ వికసిత్ భారత్ లక్ష్యంలో భాగమవుతామని అన్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌. ఇదే స‌మ‌యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో భాగంగా హ‌నుమాన్ ప్రాజెక్టు తీసుకు వ‌చ్చామ‌ని తెలిపారు. పూర్తి సాంకేతికతతో కూడిన 100 వాహనాలను ప్రారంభించామని తెలిపారు. అందులో 93 ర్యాపిడ్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ వాహనాలు కాగా, మరో 7 వాహనాలు వన్యప్రాణుల సంరక్షణతో పాటు వాటికి అవసరమైన వైద్య సహాయాన్ని అందించేందుకు అవసరమైన అంబులెన్స్ లు ఉన్నాయని వెల్ల‌డించారు డిప్యూటీ సీఎం.

  • Related Posts

    అగ్నిమాప‌క సిబ్బంది ప‌నితీరు భేష్ : అనిత వంగ‌ల‌పూడి

    అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర హోం, విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖ‌ల మంత్రి వంగ‌ల‌పూడి అనిత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో అగ్ని మాప‌క శాఖ‌లో ప‌ని చేస్తున్న సిబ్బంది, ఉద్యోగుల ప‌నితీరు అద్భుతంగా ఉందంటూ ప్ర‌శంసలు కురిపించారు. సోమ‌వారం విజయనగరం జిల్లాలో…

    జ‌గ‌న్ రెడ్డి ఆరోప‌ణ‌లు అవాస్త‌వం : డోలా శ్రీ బాల

    అమ‌రావ‌తి : మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి నిప్పులు చెరిగారు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై. ఆయ‌న చేస్తున్న ఆరోప‌ణ‌లలో వాస్త‌వం లేద‌న్నారు. సోమ‌వారం మంత్రి మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం సర్వీస్ రూల్స్ లేకుండా, నిర్దిష్ట…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *