హైదరాబద్ : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రముఖ ఐటీ సంస్థ జెన్ పాక్ట్ కంపెనీని ప్రశంసించారు. జెన్‌ప్యాక్ట్ భాగస్వామ్యంతో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మార్స్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఐటీ, లాజిస్టిక్, ఫార్మా రంగాలకు హైదరాబాద్ కేరాఫ్ గా మారిందన్నారు శ్రీధర్ బాబు. ఈ కేంద్రం 400 మందికి పైగా జెన్‌ప్యాక్ట్ సహోద్యోగులతో ప్రారంభమైందని చెప్పారు. రాబోయే సంవత్సరాల్లో 1,000 మంది మార్స్ అసోసియేట్‌లకు విస్తరించే ప్రణాళికలతో ఇది పనిచేస్తుందని అన్నారు. ఇది 60,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉందన్నారు.
ఈ కేంద్రంలోని బృందాలు ఏఐ (AI), సాఫ్ట్‌వేర్ , క్లౌడ్ ఇంజనీరింగ్, ఆటోమేషన్, డేటా , అనలిటిక్స్, ఇంకా ఇతర టెక్నాలజీ రంగాలలో పనిచేస్తాయని వెల్లడించారు శ్రీధర్ బాబు. మనలో చాలా మందికి స్నికర్స్, ఎం&ఎం’స్, పెడిగ్రీ ,, రాయల్ కానిన్ వంటి బ్రాండ్‌ల ద్వారా మార్స్ గురించి తెలుసు. మార్స్ వంటి ఒక గ్లోబల్ కంపెనీ తన జీసీసీ (GCC) కోసం హైదరాబాద్‌ను ఎంచుకోవడం చూడటానికి చాలా సంతోషంగా అంతకు మించి గర్వ కారణంగా ఉందన్నారు. ఈ సందర్బంగా మార్స్ , జెన్‌ప్యాక్ట్ బృందాలకు అభినందనలు తెలిపారు.




