Friday, 13 November 2026

కీలక ప్రాంతాల్లో పర్సనల్ రాపిడ్ ట్రాన్సిట్ వ్య‌వ‌స్థ‌

newsseals-CM

హైద‌రాబాద్ : కోర్ అర్బన్ ఏరియా పరిధిలోని కీలక ప్రాంతాల్లో ‘పర్సనల్ రాపిడ్ ట్రాన్సిట్’ వ్యవస్థను అమలు చేసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ట్రాఫిక్ సమస్యలను తగ్గించడం, ప్రయాణ సమయాన్ని ఆదా చేయడం, కాలుష్యాన్ని నియంత్రించడం వంటి ముఖ్యమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. బోధి పెవిలియన్‌లో ఉన్నతాధికారులతో ‘పర్సనల్ రాపిడ్ ట్రాన్సిట్’ వ్యవస్థపై సమీక్ష నిర్వహించారు. అత్యంత రద్దీగా ఉండే KPHB మెట్రో స్టేషన్ నుండి దుర్గం చెరువు, రహేజా మైండ్‌స్పేస్ , బయో డైవర్సిటీ స్టేషన్ వరకు PRT మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

డిసెంబర్ నాటికి టెండర్ ప్రక్రియను పూర్తి చేయాలని, ఏడాదిలోపు ఈ మార్గంలో పీఆర్టీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకు రావాలని అన్నారు. ఈ మార్గంలో గచ్చిబౌలిలోని ఐకియా సమీపంలో మల్టీ-లెవల్ పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని, దానిలోనే పీఆర్టీ డిపోను కూడా నిర్మించాలని సూచించారు నగరంలో మరో PRT మార్గాన్నిLB స్టేడియం నుండి అంబేద్కర్ విగ్రహం, ఇందిరా పార్క్, లోయర్ ట్యాంక్ బండ్ మీదుగా రాణిగంజ్ బస్ స్టాండ్ వరకు నిర్మించాలని ఆయన ప్రతిపాదించారు. అలాగే, అసెంబ్లీ మెట్రో స్టేషన్‌ను రవీంద్ర భారతి, సచివాలయం , ఐమాక్స్ (IMAX) లతో అనుసంధానిస్తూ బేగంపేట వరకు విస్తరించేలా మరొక పీఆర్టీ మార్గాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నెక్లెస్ రోడ్డు మార్గంలో మల్టీ-లెవల్ పార్కింగ్ సదుపాయాన్ని కల్పించి, దానిలోనే పీఆర్టీ డిపోను నిర్మించాలని ఆయన సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *