చెల‌రేగిన భార‌త్ త‌ల‌వంచిన చైనా

ఆసియా క‌ప్ హాకీ పైన‌ల్ కు ఇండియా

ఢిల్లీ – భార‌త హాకీ జ‌ట్టు అరుదైన ఘ‌న‌త సాధించింది. బ‌ల‌మైన జ‌ట్టుగా పేరు పొందిన చైనాను చిత్తు చేసింది. ఏకంగా ఒక‌టి కాదు రెండు కాదు 7 గోల్స్ తేడాతో ఓడించింది. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుకు ఒక్క గోల్ కూడా చేసేందుకు ఛాన్స్ ఇవ్వ‌లేదు ఆట‌గాళ్లు. ఆట ఆరంభం నుంచి పూర్త‌య్యేంత వ‌ర‌కు భార‌త్ త‌న ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ వ‌చ్చింది. చైనా ఆటగాళ్లు చేసిన ప్ర‌య‌త్నం ఏదీ ఫ‌లించ లేదు. దీంతో భార‌త్ బ‌ల‌మైన జ‌ట్టుగా త‌న‌ను తాను ప్రూవ్ చేసుకుంది ఈ కీల‌క మ్యాచ్ తో. మ‌రో వైపు కొరియా కూడా ఆసియా క‌ప్ హాట్ ఫెవ‌రేట్ గా ఉంది.

భార‌త్, చైనా జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన కీల‌క పోరాటంలో మ‌న ఆట‌గాళ్లు సూప‌ర్ షో చేశారు. క‌ళ్లు చెదిరేలా ఆడారు. ప్ర‌త్య‌ర్థుల‌కు చుక్క‌లు చూపిస్తూ మైదానం అంతా క‌లియ తిరిగారు. ఆట‌లో భాగంగా శిలానంద్ ల‌క్రా , దిల్ ప్రీత్ సింగ్ , మ‌న్ దీప్ సింగ్ , రాజ్ కుమార్ పాల్ , సుఖ్ జీత్ సింగ్ చెరో గోల్ సాధించారు. ఈ త‌రుణంలో అద్భుత‌మైన గోల్స్ కొట్టాడు..ప్ర‌త్య‌ర్థల‌కు బిగ్ షాక్ ఇచ్చాడు అభిషేక్ . త‌ను రెండు కీల‌క‌మైన గోల్స్ చేశాడు. దీంతో మొత్తం భార‌త ఆట‌గాళ్లు 7 గోల్స్ చేశారు. చివ‌రి నిమిషం వ‌ర‌కు ప‌ట్టు కోల్పోకుండా ఆట‌ను త‌మ కంట్రోల్ లో ఉంచుకుంది టీమిండియా. దీంతో ఈ మ్యాచ్ గెలుపుతో నేరుగా ఆసియా క‌ప్ హాకీ టోర్నీలో ఫైన‌ల్ కు చేరుకుంది. ఈ సంద‌ర్బంగా దేశ ప్ర‌ధాన మంత్రి మోదీ జ‌ట్టును అభినందించారు.

  • Related Posts

    వ‌న్డే కెప్టెన్ శుభ్ మ‌న్ గిల్ కు ప్ర‌మోష‌న్

    శ్రేయాస్ అయ్య‌ర్ కు బీసీసీఐ బిగ్ షాక్ ముంబై : బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ అజిత్ అగార్క‌ర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో శుభ్ మ‌న్ గిల్ కు ప్ర‌మోష‌న్ ఇచ్చారు. త‌న‌ను ఇప్ప‌టికే టి20 ఫార్మాట్…

    జాతీయ మోటార్ స్పోర్ట్స్ ను ప్రారంభించ‌నున్న కేటీఆర్

    ఈనెల 11న త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూరులో స్టార్ట్ చెన్నై : మాజీ మంత్రి కేటీఆర్ కు అరుదైన గౌర‌వం ల‌భించింది. త‌మిళ‌నాడు రాష్ట్రంలోని కోయం బత్తూరులో జాతీయ మోటార్‌స్పోర్ట్స్ పోటీలను ప్రారంభించనున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ .10వ ఎఫ్‌ఎంఏఈ నేషనల్ స్టూడెంట్ మోటార్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *