ఏపీకి 17,293 మెట్రిక్ టన్నుల యూరియా

కాకినాడ పోర్టులో దిగుమతికి కేంద్రం జీవో జారీ

అమ‌రావ‌తి : రాష్ట్రంలో అత్యవసరంగా యూరియా కోసం ఎదురు చూస్తున్న జిల్లాలకు యుద్ధ ప్రాతిపదికన యూరియాను పంపాలని అధికారుల‌ను ఆదేశించారు వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. రైతులకు ఎక్కడా యూరియా సమస్య లేకుండా చూడాలని స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 80,503 మెట్రిక్ టన్నుల ఎరువుల నిల్వ ఉందని మంత్రికి తెలిపారు అధికారులు. యూరియాను బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్ప‌ష్టం చేశారు అచ్చెన్నాయుడు. ఎరువుల కేటాయింపు అంశంపై కేంద్ర మంత్రి నడ్డాతో ఫోన్లో సీఎం చంద్ర‌బాబు మాట్లాడ‌టం వ‌ల‌నే రాష్ట్రానికి యూరియా కేటాయింపు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. సోమ‌వారం మంత్రి మీడియాతో మాట్లాడారు.

వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లి రైతులకు ఎరువులపై భరోసా ఇవ్వాలని సూచించారు.
ర‌బీ సీజ‌న్ కు కేంద్రం 9.3 లక్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ఎరువుల‌ను రాష్ట్రానికి కేటాయించిందని, రైతులు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదని స్ప‌ష్టం చేశారు. ఈ సంద‌ర్భంగా కీల‌క సూచ‌న‌లు చేశారు. ఎప్ప‌టిక‌ప్పుడు యూరియా అందుబాటులో ఉంచాల‌ని, ఇదే స‌మ‌యంలో ఎవ‌రికి ఎంతెంత కేటాయింపు చేశార‌నే దానిపై కూడా క్లారిటీ రావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ప్ర‌తి ఒక్క రైతుకు ఎరువు కొర‌త లేకుండా చూస్తామ‌ని , ఎవ‌రూ ఆందోళ‌న చెంద‌వద్ద‌ని కోరారు అచ్చెన్నాయుడు.

  • Related Posts

    నాగర్‌కర్నూల్, వికారాబాద్ ల‌లో కేంద్రీకృత వంట‌శాల‌లు

    హైద‌రాబాద్ : జున్నా సోలార్ సిస్టమ్స్ , చైన్ ల్యాబ్స్ ఇండియా సంస్థల‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు రాష్ట్ర ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డి. శుక్ర‌వారం జూబ్లీ హిల్స్‌లోని త‌న‌ నివాసంలో హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులు స‌మావేశం అయ్యారు. ప్రభుత్వ పాఠశాలల…

    ధ‌ర‌ల నియంత్ర‌ణ‌లో విజ‌య్ విఫ‌లం : ఎంకే స్టాలిన్

    తిరుప్పూర్ జిల్లా : రాష్ట్రంలో ధ‌ర‌ల నియంత్ర‌ణను నియంత్రించ‌డంలో టీవీకే స‌ర్కార్ వైఫ‌ల్యం చెందింద‌ని ఆరోపించారు మాజీ సీఎం ఎంకే స్టాలిన్. ‘ఎమ్మెల్యేల కొనుగోలు’లో నిమగ్నమైన ఆయనకు ప్రజల కష్టాలు తెలుసా అని ప్రశ్నించారు. గత నాలుగు నెలల్లో నిత్యావసర వస్తువుల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *