
గ్రాండ్ గా లాంచ్ అయిన షో
హైదరాబాద్ : ఎంతో ఉత్కంఠ రేపుతూ వచ్చిన బిగ్ బాస్ -9 సీజన్ రియాల్టీ షో ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈసారి షోను భిన్నంగా, అందరినీ, అన్ని వర్గాలను ఆకట్టుకునేలా తీర్చి దిద్దారు నిర్వాహకులు. విచిత్రం ఏమిటంటే షో ప్రారంభం కాక ముందు పలువురి పేర్లు ముందుకు వచ్చాయి. అదేమిటంటే ఈసారి బిగ్ బాస్ షో కు ప్రయోక్తగా అక్కినేని నాగార్జున ఉండక పోవచ్చని ప్రచారం జరిగింది. దానికి పుల్ స్టాప్ పెట్టేసింది స్టార్ మా, జియో హాట్ స్టార్. ప్రస్తుతం స్టార్ ను జియో చేతికి వచ్చేసింది. భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇదిలా ఉండగా గతంలో జరిగిన బిగ్ బాస్ సీజన్ల కంటే ఈసారి 9వ సీజన్ మాత్రం భిన్నంగా ఉండేలా చూశారు నాగార్జున.
గతంలో సెలిబ్రిటీలను ఎంపిక చేస్తూ వచ్చిన నిర్వాహకులు ఈసారి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. మొత్తం 15 మందిని ఎంపిక చేయగా ఇందులో ఆరుగురు కేవలం సామాన్యులు మాత్రమే ఉన్నారు. వీరికి ఎలాంటి ప్రత్యేకతలు లేక పోవడం విశేషం. రాను ముంబైకి రాను పేరుతో సెన్సేషన్ క్రియేట్ చేసిన పాలమూరు పోరగాడు రాము రాథోడ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇక బిగ్ బాస్ షో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.
ఇదిలా ఉండగా ఈ బిగ్ బాస్ -9 సీజన్ లో పార్టిసిపెంట్ల వివరాలు ఇలా ఉన్నాయి. హౌస్ లోకి వెళ్లిన వారిలో తనూజా, ఆశా షైని, జవాన్ కళ్యాణ్, ఇమ్మాన్యూయేల్, శ్రేష్టి వర్మ, హరీశ్, భరణీ శంకర్, రీతూ చౌదరి, డీమన్ పవన్, సంజన గల్రానీ, రాము రాథోడ్, దమ్ము శ్రీజ, సుమన్ శెట్టి, ప్రియా శెట్టి, మర్యాద మనీష్ ఉన్నారు.