
ఫైనల్ లో దక్షిణా కొరియాకు షాక్
భారత పురుషుల హాకీ జట్టు సంచలనం సృష్టించింది. ప్రతిష్టాత్మకమైన ఆసియా కప్ ను కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్ లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఏకంగా 4-1 గోల్స్ తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. ఏకంగా ఛాంపియన్ గా నిలిచింది. త్వరలో జరగబోయే ప్రపంచ కప్ కు నేరుగా అర్హత సాధించింది టీమిండియా. సెమీ ఫైనల్ లో బలమైన చైనా హాకీ జట్టుకు ఝలక్ ఇచ్చింది. ఒక్క గోల్ కూడా చేయనీయ లేదు మన ఆటగాళ్లు. 7-0 గోల్స్ తేడాతో ఓడించి షాక్ ఇచ్చింది. ఇక ఫైనల్ లో సైతం దుమ్ము రేపింది. ఈ టోర్నీలో ఏ ఒక్క మ్యాచ్ భారత్ ఓడి పోలేదు. అన్ని మ్యాచ్ లను గెలుపొందింది. అసలైన ఛాంపియన్ గా అవతరించింది.
ఈ టోర్నీ లో ఐదు విజయాలు, ఒక డ్రా మాత్రమే చేసుకుంది. హర్మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని జట్టు తమ మూడు పూల్ మ్యాచ్‌ల్లోనూ గెలిచింది. సూపర్ 4లలో వ దక్షిణ కొరియాతో 2-2తో డ్రాగా ముగిసిన తర్వాత వరుసగా మలేషియా, చైనాలను 4-1 , 7-0 తేడాతో ఓడించారు. ఇది భారతదేశం జట్టుకు సంబంధించి నాల్గవ ఆసియా కప్ టైటిల్ గెలుచు కోవడం. గతంలో 2003, 2007, 2017లో టోర్నమెంట్‌ను గెలుచుకుంది. దక్షిణ కొరియా ఐదుసార్లు 1994, 1999, 2009, 2013, 2022లో విజేతగా నిలిచింది. ఇదిలా ఉండగా భారత జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసి ఛాంపియన్ గా నిలిచినందుకు జట్టును ప్రత్యేకంగా అభినందించారు ప్రధాని మోదీ.