
సిఫారసులకు నో ఛాన్స్ భక్తులకే ప్రయారిటీ
తిరుమల : శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువు తీరిన తిరుమలలో ఇవాళ మరోసారి ఈవోగా బాధ్యతలు చేపట్టడం చెప్పలేనంత ఆనందంగా ఉందన్నారు అనిల్ కుమార్ సింఘాల్. బుధవారం మరోసారి ఆయన కొలువు తీరారు. టీటీడీ ఎక్స్ అఫిసియో మెంబర్ గా కూడా ప్రమాణం చేశారు. అంతకు ముందు అనిల్ కుమార్ సింఘాల్ కాలి నడకన తిరుమలకు చేరుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికారు టీటీడీకి ఈవోగా పని చేస్తూ బదిలీపై వెళుతున్న జె. శ్యామల రావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మంతో పాటు ఆలయ ప్రధాన పూజారులు, అర్చకులు . అంతకు ముందు అనిల్ కుమార్ సింఘాల స్వామి వారిని దర్శించుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇది స్వామి తనకు ఇచ్చిన గొప్ప అవకాశం అన్నారు. మరోసారి తాను వస్తానని అనుకోలేదన్నారు. కానీ ఆ దేవ దేవుడు తనను కరుణించాడని చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని చెప్పారు. ఇప్పటి వరకు పని చేసిన ఈవో చాలా సంస్కరణలు తీసుకు వచ్చారని అన్నారు. సాంకేతికతను ఉపయోగించుకునేలా చేస్తామన్నారు. ఇదే క్రమంలో భక్తుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు అనిల్ కుమార్ సింఘాల్. ఏ ఒక్కరికీ ఇబ్బంది తలెత్తకుండా తన వంతుగా పని చేస్తానని, ఎలాంటి పైరవీలకు , సిఫారసులకు తావంటూ ఉండదని స్పష్టం చేశారు ఈవో.