ఆక‌స్మిక త‌నిఖీ చేసిన ఈవో సింఘాల్

ప‌లు శాఖ‌ల‌ను ప‌రిశీలించిన అనిల్ కుమార్

తిరుప‌తి : టీటీడీ నూత‌న ఈవోగా కొలువు తీరిన అనిల్ కుమార్ సింఘాల్ దూకుడు పెంచారు. గురువారం ఆయ‌న ఆక‌స్మికంగా త‌నిఖీలు చేప‌ట్టారు. తిరుపతి టిటిడి పరిపాలనా భవనంలోని పలు శాఖలను ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సందర్శించారు. మొదటగా అకౌంట్స్, అన్నదానం, బోర్డు సెల్, ఐ.టి, సోషల్ మీడియా, ఇంజనీరింగ్, ఎడ్యుకేషన్, ప్రజా సంబంధాల కార్యాలయం, ఎస్టేట్ కార్యాలయాలను త‌నిఖీ చేశారు. సదరు అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. ఈ సందర్భంగా టిటిడి ఈవోకు అధికారులు, సిబ్బంది స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, ఉద్యోగులు నూతన సాంకేతికతను మరింతగా అందిపుచ్చుకుని వేగవంతంగా సేవలు అందించాలని సూచించారు.

అంతకు ముందు ఈవో ఛాంబర్ లో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయం, శ్రీ కోదండరామ స్వామి ఆలయం, శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయం నుండి వచ్చిన వేద పండితులు శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ కు వేదాశీర్వచనం చేశారు. ముందుగా టిటిడి పరిపాలనా భవనానికి టిటిడి ఈవో చేరుకోగానే, పలువురు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, సిబ్బంది స్వాగతం పలికారు. టిటిడి ఈవో వెంట ఎఫ్ఏ అండ్ సిఏవో ఓ. బాలాజీ, అదనపు ఎఫ్ఏసిఏవో రవిప్రసాద్, చీఫ్ ఇంజనీర్ టి.వి. సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

  • Related Posts

    శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో విశేష ఉత్స‌వాలు

    వెల్ల‌డించిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. తిరుమ‌ల ఆల‌య ప‌రిధిలోని ఆల‌యాల‌లో అక్టోబ‌ర్ నెల‌లో నిర్వ‌హించే ఉత్స‌వాల వివ‌రాల‌ను వెల్ల‌డించింది. ఇందులో భాగంగా అక్టోబర్…

    అంగ‌రంగ వైభ‌వంగా ప‌విత్రోత్స‌వాలు

    శ్రీ‌ప‌ట్టాభిరామ స్వామివారి ఆల‌యంలో తిరుపతి : అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామ స్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *