నేపాల్ ప్ర‌ధానిగా కొలువు తీరిన సుశీలా క‌ర్కి

Spread the love

దేశంలోనే తొలిసారిగా మహిళా నాయ‌కురాలు

నేపాల్ : ఎట్ట‌కేల‌కు నేపాల్ ప్ర‌ధాన‌మంత్రిగా సుశీలా క‌ర్కి కొలువు తీరారు. ఆమెతో దేశ అధ్య‌క్షుడు ప్ర‌మాణ స్వీకారం చేయించారు. దేశానికి తొలి మ‌హిళా నాయ‌కురాలిగా గుర్తింపు పొందారు. గ‌తంలో త‌ను దేశ ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా చేశారు. సోష‌ల్ మీడియాపై నిషేధం కార‌ణంగా ఆందోళ‌న‌లు మిన్నంటాయి. ఓలి శ‌ర్మ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశాడు. దేశం నుంచి దుబాయ్ కి పారి పోయాడు. ఇదిలా ఉండ‌గా దేశ అధ్య‌క్షుడు పార్ల‌మెంట్ ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ఈనెల 12 అర్ద‌రాత్రి నుంచి ఇది వ‌ర్తిస్తుంద‌ని, ఈ మేర‌కు తాత్కాలిక పీఎంగా సుశీలా క‌ర్కికి బాధ్య‌త‌లు అప్ప‌గించిన‌ట్లు దేశ అధ్యక్షుడి కార్యాల‌యం ప్ర‌క‌టించింది.

అంతే కాకుండా వ‌చ్చే ఏడాది 2026 మార్చి 21న ఎన్నిక‌లు దేశ వ్యాప్తంగా నిర్వ‌హించాల‌ని ప్ర‌క‌ట‌న‌లో స్ప‌ష్టంగా పేర్కొన్నారు. ప్ర‌మాణ స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మం ఖాట్మండులోని అధికారిక నివాసంలో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి దేశానికి చెందిన ప్ర‌ధాన న్యాయమూర్తి, ప్ర‌తిప‌క్ష నాయ‌కులు, ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. ఇదే స‌మ‌యంలో దేశంలో స్వేచ్ఛ‌కు విలువ ఇవ్వాల‌ని, ఆధిప‌త్యం చెల్లుబాటు కాదంటూ పేర్కొన్నారు ఆందోళ‌న‌కారులు. ఇది అరుదైన అవ‌కాశం . ద‌య‌చేసి దేశానికి మీ నాయ‌క‌త్వంలో మంచి పేరు తీసుకు రావాల‌ని కోరారు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్టులతో హోరెత్తించారు.

  • Related Posts

    కేంద్ర మంత్రివ‌ర్గంలో భారీ మార్పులు..?

    Spread the love

    Spread the loveసంకేతాలు ఇచ్చిన ట్ర‌బుల్ షూట‌ర్ షా న్యూఢిల్లీ : కేంద్రంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎన్డీయే ప్ర‌భుత్వంలో కీల‌క‌మైన ప‌ద‌వులు మార్చే ఛాన్స్ లేక పోలేద‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌ధానంగా బీజేపీకి చెందిన ట్ర‌బుల్ షూట‌ర్,…

    APAIMS 2.0 వ్యవస్థతో అక్ర‌మాల‌కు చెక్

    Spread the love

    Spread the loveఎరువుల పంపిణీపై ఏపీ స‌ర్కార్ ప్ర‌క‌ట‌న అమ‌రావ‌తి : ఎరువు పంపిణీలో పూర్తి పార‌ద‌ర్శ‌క‌త ఉండేందుకు ఏపీ కూట‌మి స‌ర్కార్ ఏపీఏఐఎంఎస్ 2.0 వ్య‌వ‌స్థ‌ను తీసుకు వ‌చ్చింది. గత ప్రభుత్వ హయాంలో సబ్సిడీ ఎరువుల పంపిణీలో చోటుచేసుకున్న అక్రమాలు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *