బీసీ భావజాల ఉద్యమాన్ని పల్లె పల్లెకు విస్తరిస్తాం

పాటే ఆయుధంగా బీసీ రాజకీయ అధికారం సాధిస్తాం

హైద‌రాబాద్ : పాటనే ఆయుధంగా చేసుకున బీసీ కవులు, రచయితలు, కళాకారులు బీసీ భావజాల ఉద్యమాన్ని పల్లె పల్లెకు విస్తరించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు . ఆదివారం హైదరాబాదులో బీసీ కల్చరల్ ఫోరం రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు వరంగల్ శ్రీనివాస్ అధ్యక్షత వహించగా దరువు అంజన్న, కేదారి శ్రీనివాస్ లు సమన్వయం చేశారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీలకు వారసత్వంగా గొప్ప చరిత్ర ఉందని, బీసీ కులాలలో రాజులు, చక్రవర్తులు, మహనీయులు జన్మించారని చెప్పారు. బీసీ కులాలలో తరతరాలుగా ఎంతో ప్రతిభ, పాటావాలు కలిగిన చరిత్ర ఉందన్నారు. ఇలాంటి ఘనమైన చరిత్ర కలిగిన బీసీలు ఇవాళ‌ బలహీనంగా అర శాతం, ఐదు శాతం లేని వాళ్ళ దగ్గర సాగిల పడి అడుక్కోవడంలో అర్థం లేదన్నారు.

బిసి కళాకారులు, కవులు తమ కళాలను గలాలను బీసీల వారసత్వాన్ని, సాంస్కృతిక చైతన్య వైభవాన్ని భవిష్యత్ తరాలకు చాటి చెప్పి పాలితులుగా ఉన్న బీసీలను పాలకులుగా చేయడానికి బీసీ సాంస్కృతిక సైన్యం నిర్విరామంగా కృషి చేయాలని ఆయన కోరారు. బీసీ ఉద్యమాన్ని రాయితీల నుండి రాజ్యాధికారం కోసం, స్వయం పాలన, స్వయం నిర్ణయ అధికారం వచ్చే వరకు చేసే ఉద్యమంలో కవులు. కళాకారులు, రచయితలు తమ వంతు పాత్ర పోషించాలని శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు .

బీసీ కల్చరల్ ఫోరం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి లు వరంగల్ శ్రీనివాస్ ,దరువు అంజన్న లు మాట్లాడుతూ బీసీ సాంస్కృతిక ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి దసరా తర్వాత 33 జిల్లాలో సభలు, సమావేశాలు నిర్వహిస్తామని అన్నారు. ఆ తర్వాత హైదరాబాదులో వేలాది మందితో బీసీ కల్చరల్ ఫోరం రాష్ట్ర మహాసభను నిర్వహిస్తామని తెలిపారు

బీసీ కల్చరల్ ఫోరం రాష్ట్ర కార్యనిర్వాహ అధ్యక్షులు కోదారి శ్రీనివాస్, రాష్ట ఉపాధ్య‌క్షులు అంబటి వెంకన్న, సిరిసినవాడ రామలింగం లు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ తరహా లోనే బీసీల రాజకీయ చైతన్యానికి గ్రామ గ్రామాన బీసీల ధూంధాం సభలు నిర్వహిస్తామని ప్ర‌క‌టించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీ సాంస్కృతిక ఉద్యమాన్ని ఉధృతం చేసి బీసీల హక్కులను సాధించడానికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు.

ఈ సమావేశంలో సిగ విజయ్, మానుకోట ప్రసాద్, మద్దెల సందీప్, సంతోష్, జడల రమేష్, యాట సంధ్య, బుల్లెట్ వెంకన్న, బీసీ నాయకులు కుల్కచర్ల శ్రీనివాస్, కనకాల శ్యాం కుర్మా, భీమనీ మంజరి, చంద్రశేఖర్ గౌడ్, జాజుల లింగం గౌడ్, వరికుప్పల మధు, తదితరులు పాల్గొన్నారు .

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *