మోదీ నాయ‌కత్వంలో భార‌త్ బ‌లోపేతం

Spread the love

బీజేపీ స్పోక్స్ ప‌ర్స‌న్ అనిల్ కె ఆంటోనీ

విజ‌య‌వాడ : స‌మ‌ర్థ‌వంత‌మైన న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వంలో భార‌త దేశం అన్ని రంగాల‌లో ముందంజలో ఉంద‌న్నారు బీజేపీ స్పోక్స్ ప‌ర్స‌న్, వ‌న్ నేష‌న్ వ‌న్ ఎల‌క్ష‌న్ క‌న్వీన‌ర్ అనిల్ కె ఆంటోనీ. సోమ‌వారం విజ‌య‌వాడ‌లో జ‌రిగిన కీల‌క స‌మావేశంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. వివిధ రాష్ట్రాల నుంచి ప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు. కేంద్ర స‌ర్కార్ ప్రారంభించిన ఎన్నిక‌ల సంస్క‌ర‌ణ‌ల‌పై విస్తృతంగా చ‌ర్చించ‌డం జ‌రిగంద‌న్నారు. గ‌తంలో నాలుగు స్లాబ్స్ జీఎస్టీ రేట్లు ఉండేవ‌న్నారు. కానీ ఇటీవ‌ల ప్ర‌ధాన‌మంత్రి తీసుకున్న అసాధార‌ణ నిర్ణ‌యం కార‌ణంగా పేద‌లు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు మేలు చేకూర్చేలా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ సార‌థ్యంలో జ‌రిగిన కీల‌క స‌మావేశంలో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నార‌ని చెప్పారు.

నాలుగు స్లాబ్స్ రేట్స్ ను కేవ‌లం రెండు స్లాబ్ ల‌కే ప‌రిమితం చేస్తూ తీర్మానం చేశార‌న్నారు. దీని వ‌ల్ల పేద‌లకు మ‌రింత మేలు చేకూర్చుతుంద‌న్నారు. దీని కార‌ణంగా దేశ ఆర్థికాభివృద్దికి దోహద ప‌డుతుంద‌న్నారు అనిల్ కె. ఆంటోనీ. రాబోయే మూడు సంవ‌త్స‌రాల కాలంలో భార‌త దేశం ఆర్థిక ప‌రంగా బ‌ల‌మైన శ‌క్తిగా మార‌డం ఖాయ‌మ‌న్నారు . ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. 2014 నుంచి దేశంలో బీజేపీ మ‌రింత బ‌లీయ‌మైన శ‌క్తిగా మారింద‌న్నారు. ఇది దేశం మ‌రింత ధృఢంగా త‌యారు అయ్యేందుకు దోహ‌దం చేసింద‌న్నారు అనిల్ కె ఆంటోనీ. ఈ స‌మావేశంలో ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మ‌ధుక‌ర్ , వన్ నేషన్ వన్ ఎలక్షన్ స్టేట్ కన్వీనర్ సూర్యనారాయణ రాజు, రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డి, మిట్ట వామ్డికృష్ణ, హ‌రికృష్ణ నాగోతు, మ‌ల్యాద్రి హాజ‌ర‌య్యారు.

  • Related Posts

    గ్రామాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం

    Spread the love

    Spread the loveఅంద‌జేస్తామ‌న్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలోని గ్రామాల స‌ర్వతోముఖాభివృద్దికి సంపూర్ణ స‌హ‌కారం అంద‌జేస్తామ‌ని అన్నారు. ఈ సంద‌ర్బంగా అన్ని ర‌కాలుగా స‌హాయ స‌హ‌కారాలు…

    డిజిటల్ సెన్సస్ 2027 కోసం సన్నాహాలు

    Spread the love

    Spread the loveతెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌మీక్ష‌ హైద‌రాబాద్ : ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు తో పాటు సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ తెలంగాణ భారతి హోళికేరితో కలిసి రాబోయే సెన్సస్ ప్రక్రియకు సంబంధించిన విధి విధానాల గురించి జిల్లా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *