
బీజేపీ స్పోక్స్ పర్సన్ అనిల్ కె ఆంటోనీ
విజయవాడ : సమర్థవంతమైన నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత దేశం అన్ని రంగాలలో ముందంజలో ఉందన్నారు బీజేపీ స్పోక్స్ పర్సన్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ కన్వీనర్ అనిల్ కె ఆంటోనీ. సోమవారం విజయవాడలో జరిగిన కీలక సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. కేంద్ర సర్కార్ ప్రారంభించిన ఎన్నికల సంస్కరణలపై విస్తృతంగా చర్చించడం జరిగందన్నారు. గతంలో నాలుగు స్లాబ్స్ జీఎస్టీ రేట్లు ఉండేవన్నారు. కానీ ఇటీవల ప్రధానమంత్రి తీసుకున్న అసాధారణ నిర్ణయం కారణంగా పేదలు, మధ్యతరగతి ప్రజలకు మేలు చేకూర్చేలా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సారథ్యంలో జరిగిన కీలక సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.
నాలుగు స్లాబ్స్ రేట్స్ ను కేవలం రెండు స్లాబ్ లకే పరిమితం చేస్తూ తీర్మానం చేశారన్నారు. దీని వల్ల పేదలకు మరింత మేలు చేకూర్చుతుందన్నారు. దీని కారణంగా దేశ ఆర్థికాభివృద్దికి దోహద పడుతుందన్నారు అనిల్ కె. ఆంటోనీ. రాబోయే మూడు సంవత్సరాల కాలంలో భారత దేశం ఆర్థిక పరంగా బలమైన శక్తిగా మారడం ఖాయమన్నారు . ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. 2014 నుంచి దేశంలో బీజేపీ మరింత బలీయమైన శక్తిగా మారిందన్నారు. ఇది దేశం మరింత ధృఢంగా తయారు అయ్యేందుకు దోహదం చేసిందన్నారు అనిల్ కె ఆంటోనీ. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి మధుకర్ , వన్ నేషన్ వన్ ఎలక్షన్ స్టేట్ కన్వీనర్ సూర్యనారాయణ రాజు, రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డి, మిట్ట వామ్డికృష్ణ, హరికృష్ణ నాగోతు, మల్యాద్రి హాజరయ్యారు.